మద్యం ప్రియులకు నిజంగా ఇది చేదువార్తే అని చెప్పాలి. మూడు రోజులు మద్యం షాపులు బంద్ కానున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈనె 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈమేరకు 29 నుంచి షాపులను మూసీ వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశాలు జారీచేశారు. అలాగే డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు రోజు కూడా మద్యం షాపులను మూసీవేయాలని తెలిపారు. మద్యాన్ని అక్రమంగా తరలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే నల్లబెల్లం, మద్యం తయారుకు సంబంధించిన ముడిసరుకులను రవాణా చేయకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నిబంధనల్లో భాగంగా ఈనెల 29 నుంచి డిసెంబర్1 వరకు మద్యం షాపులు క్లోజ్ చేయనున్నారు. దీంతో మందుబాబులు అలర్టవుతున్నారు. ముందస్తుగానే మద్యం తెచ్చుకునే ప్రయత్నాలను మొదలు పెడుతున్నారు. 3 రోజులు మద్యం షాపులు బంద్ అవుతుండటంతో ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ముందే మద్యాన్ని రవాణా చేసుకునే పనిలో కొంత మంది నేతలు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- న్యూ వే : సరుకు ముసుగులో నిషా.. కిక్కే కిక్కు