కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లే మహిళలకు బైక్ పై లిఫ్టు ఇచ్చిన ఇద్దరు యువకులు ఆ మహిళను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆత్కూరు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెంపల్లి వాసులుగా గుర్తింపు
ఒంటరి మహిళపై అఘాయిత్యానికి బరితెగించిన నీచులు తెంపల్లి నివాసులుగా పోలీసులు గుర్తించారు. దుశ్చర్యకు పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుదామని ఇంటికి బయలు దేరిన మహిళపై దుండగులు రేప్ కు పాల్పడటం జిల్లాలో సంచలనంగా మారింది.
Must Read ;- ఒంగోలులో మహిళా వాలంటీర్ సజీవ దహనం