తొలుత తన మాతృభాషకు చెందిన మలయాళ సినీరంగంలో బాలనటిగా అరంగేట్రం చేసిన నివేదాథామస్ ఆ తర్వాత హీరోయిన్ గా పరిచయమైంది. ఆలా మలయాళంతో పాటు తమిళ చిత్రాలు చేస్తూ నాలుగేళ్ల క్రితం తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంలో నానికి జోడీగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. దాంతో నాని సరసనే “నిన్ను కోరి” అనే మరో చిత్రంలో నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆ చిత్రంలో కూడా ఆమె నటనకు మంచి పేరే వచ్చింది. ఈ క్రమంలోనే జూ.ఎన్ఠీఆర్ “లవకుశ” చిత్రంలో నటించే అవకాశం ఆమెను వరించింది. ఆ చిత్రంతో పాటు అటుపిమ్మట నటించిన “బ్రోచేవారెవరురా” చిత్రం కూడా వరుస విజయాలతో పాటు చక్కటి అభినయాన్ని ప్రదర్శించగల నటిగా మరోసారి గుర్తింపు లభించింది.
ఇలా నటిగా స్థిరపడుతున్న సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ “దర్బార్” చిత్రంలో ఆయన కుమార్తెగా నటించే అరుదైన అవకాశం వచ్చింది. ప్రస్తుతం మూడు తెలుగు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. వాటిలో పవన్ కల్యాణ్ “వకీల్ సాబ్” చిత్రంతో పాటు “శ్వాస” అనే మరో చిత్రంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ నివేదా సందడి చేయబోతోంది. కేవలం గ్లామర్ నే నమ్ముకోకుండా గ్లామర్ తో పాటు గ్రామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలనే తాను అంగీకరిస్తున్నానని ఆమె చెబుతోంది. పెద్ద స్టార్ల చిత్రాలలో మెయిన్ హీరోయిన్ అని కాకపోయినా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటే నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ మధ్య ఆమె వెల్లడించింది కూడా. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలన్నీ నటనకు ఎంతో స్కోప్ ఉన్న చక్కటి చిత్రాలని నివేద అంటోంది.
Mats Read ;- క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్