ఆ కుర్రాడు నావికాదళంలో పనిచేయాలని, ఆ రకంగా దేశానికి సేవలందించాలని ఎంతో కలలు కన్నాడు. తన శక్తి మేరకు సెలక్ట్ కావడానికి ప్రయత్నాలు కూడా చేశాడు. అందుకోసం ప్రత్యేకంగా దేశరాజధాని నుంచి విశాఖకు వచ్చాడు. అయితే నేవీకి సెలక్ట్ కాలేదు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విశాఖ లో నేవీలోకి ఎంపిక కాలేదని ఒక విశాఖపట్నం యువకుడు, తమ భవంతి నాల్గవ అంతస్దుప్తె నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ నగరంలోని శ్రీహరిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిల్లీకీ చెందిన వ్తెభవ్ సింగ్ (18), నేవీ లో టెక్నికల్ ఎంట్రీ సర్వీస్ (TES) ఇంటర్వ్యూకు వచ్చాడు.
నేవీలో ఎంపిక కాలేదని మనస్ధాపంతో శ్రీహరిపురంలోని తన పెదనాన్న వుంటున్న అపార్టుమెంట్ నాల్గవ అంతస్ధుప్తె నుంచి దూకి మృతి చెందాడు. మృతదేహాన్ని పొస్టుమార్టం కోసం కేజిహెచ్ కు తరలించి, మల్కాపురం పోలీసులు కేసు నమోదు చెసి దర్యాప్తు చేపట్టారు.
Must Read ;- ఢిల్లీ లాగా విశాఖలో చేయండి : జగన్ విజ్ఞప్తి