జన సంచారం లేని చోట వరుస హత్యలు జరుగుతుంటాయి. దీనికి కారణం ఎవరు? అన్న కోణంలో సాగే హారర్ థ్రిల్లర్ కథతో ”ఐందవి” చిత్రాన్ని మలిచారు. నందు, అనురాధ హీరో హీరోయిన్లు. ఫణిరామ్ తుఫాన్ దర్శకుడు. సన్నీ అండ్ విన్నీ సినిమాస్ పతాకంపై శ్రీధర్ లింగం నిర్మించారు..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఓ ఆరుగురు వ్యక్తులు కొన్ని రోజులు సరదాగా గడిపేందుకు జన సంచారం లేని ప్రాంతానికి వెళతారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు హత్యలకు గురవుతారు. ఆ హత్యలు చేసిందెవరు?. ఐందవికి ఈ హత్యలకు సంబంధం ఏంటి? అన్న ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీధర్ లింగం మాట్లాడుతూ, “లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా పూర్తయింది..థియేటర్ల కోసమే ఇన్ని రోజులు ఆగాం.ఇలాంటి సినిమాలను థియేటర్లలో చుస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. సవారి చిత్రం తర్వాత నందు నటన చాలా హైలైట్ గా ఉంటుంది” అని అన్నారు. ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్, దిలీప్, అవంతిక ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఏ ఆర్మాన్, నిమాటోగ్రఫీ: భరత్ సి కుమార్, సమర్పణ” రాజేశ్వరి తుమ్మల
Must Read ;- పవన్ కళ్యాణ్ తో ఎం.ఎస్.రాజు సినిమా నిజమేనా.?











