July 4, 2026 5:53 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

సంపాదకీయం : ఆత్మహత్య వైపు నడిపించేవి ఏవి?

ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉంటుంది. ‘జీవితం ఇక దుర్భరం’ అనే దశ వచ్చినప్పుడే.. ఆత్మహత్య నిర్ణయం ఎవరైనా తీసుకుంటారు. కానీ ఆ దశ ప్రతిఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. కానీ.. అందరూ ఎంచుకునే పరిష్కారం మాత్రం ఆత్మహత్య ఒక్కటే కాదు.

December 11, 2020 at 4:01 PM
in Editorial, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రామాయణంలో- రావణ నిర్బంధంలో కష్టాల్లో ఉన్న  సీతమ్మ మదిలో కూడా ఆత్మహత్య ఆలోచన ప్రవేశించింది. కానీ ఆమె దానిని తోసిపుచ్చి తన జీవితాన్ని నిలబెట్టుకుంది..
ఎలా జరిగిందది?

చిత్ర పాండ్యన్.. ఇవాళ దేశమంతా ఈమె గురించి మాట్లాడుకుంటోంది. అంత కష్టం ఆమెకు ఏమొచ్చింది? అని అనుకుంటోంది. వార్తల ద్వారా వెలుగులోకి వస్తున్న వివరాలను బట్టి.. ఆమె జీవితంలో అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి.. ఎక్కడా పెద్దగా తేడా కనిపించడం లేదు. కానీ.. హఠాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరణంపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ, తమిళ టీవీ రంగాలకు చెందిన నటుల్లో, యాంకర్లలో.. తన ప్రతిభతో ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహం నింపే మంచి పెర్ఫార్మర్‌గా గుర్తింపు ఉన్న చిత్ర పాండ్యన్ ఆత్మహత్య సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

ప్రతినిత్యం ఆత్మహత్యలు అనేకం జరుగుతుంటాయి. అప్పుల బాధ తాళలేని రైతు ఆత్మహత్యలు, అత్తింటి ఆరళ్లు ఓర్వలేని అతివల ఆత్మహత్యలు, చదువుల ఒత్తిళ్లు భరించలేని చిన్నారుల ఆత్మహత్యలు, ప్రేమను ఈడేర్చుకునే ధైర్యం లేని యువతరం ఆత్మహత్యలు మనకు సర్వసాధారణం. అయితే తమిళ వీజే చిత్రపాండ్యన్ ఆత్మహత్య వ్యవహారంలో ఇలాంటి కారణాలు ఏవీ మచ్చుకు కూడా కనిపించవు. స్థిమితమైన జీవితమే నడుస్తోంది. పాండ్యన్ స్టోర్స్ కార్యక్రమం ద్వారా ఆమెకు సెలబ్రిటీ స్థాయిలో పాపులారిటీ ఉంది. తాను కోరుకున్న వాడితో జనవరిలో వివాహం జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయింది. (వీరికి రిజిస్టరు మేరేజి అయిందనే వాదన కూడా వినిపిస్తోంది) షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి దగ్గర్లో ఇద్దరూ కలిసే హోటల్‌లో బస చేశారు. ఆ రాత్రి షూటింగ్ నుంచి తిరిగివచ్చిన తర్వాత.. ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ప్రతిరోజూ ఎన్ని వందల వేల ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ.. కొన్నే చర్చనీయాంశం అవుతుంటాయి. ఆయా రంగాలకు ఉండే పాపులారిటీని బట్టి.. ఆ రంగాల్లోని వారి ఆత్మహత్యల గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అందుకే ఒక రైతు ఆత్మహత్య కంటె- ఒక సినీ సెలబ్రిటీ ఆత్మహత్యకు క్రేజ్ ఎక్కువ. పైగా ఇటీవలి కాలంలో సినీ, టీవీ రంగంనుంచి ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి.

Must Read ;- చిత్రను భర్తే కొట్టి చంపాడంటున్న తల్లి

ఆశలు- వాస్తవాలకు వ్యత్యాసం ఎక్కువ!

భూమ్మీద ఏ రంగంలో అయినా ఆశలు- వాస్తవాలకు మధ్య వ్యత్యాసం ఎంతో కొంత ఉంటుంది. నేలమీద కాలు ఆన్చి, వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకుని తమ జీవితాన్ని దిద్దుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే సినిమా రంగం విషయానికి వస్తే.. ఈ వ్యత్యాసాలు కొంత ఎక్కువగా ఉంటాయి- దిద్దుకోగల ఓపిక ఉన్నవారు తక్కువగా ఉంటారు. నిన్నటిదాకా మన మధ్యనే ఉంటూ ఇరానీ కేఫ్ లో వన్ బై టూ చాయ్ తాగిన వాడు, ఉస్మానియా బిస్కట్‌ను మనతో చెరిసగం తుంచుకుని, పంచుకుని కడుపు నింపుకున్న వాడు.. తెల్లారేసరికి స్టార్ అయిపోతుంటాడు. అలా ఏదో ఒకరి విషయంలో, హఠాత్తుగా మారిపోయిన తలరాత– బోలెడు మందిలో ఆశలు పుట్టిస్తుంది. ‘ఏదో ఒక రోజున- మనం కూడా ఒక్కరోజులో స్టార్ అయిపోతాం’ అనుకుంటూ బతుకుతుంటారు. ఆ ‘ఒక్క రోజు’ కోసం ఎదురుచూస్తుంటారు! ఆ ఎదురుచూపు కొన్నేళ్లు, దశాబ్దాలు కూడా సాగుతుంటుంది. ‘ఆశ’ వారి జీవితాన్ని సాగదీస్తుంటుంది.. ‘వాస్తవం’ అర్థమైనప్పుడు తట్టుకోలేని వారు ఆత్మహత్యను ఆశ్రయిస్తారు. ఇదంతా ఒక రకం.

తమను తాము పురిగొల్పుకుని, పులిసవారీ చేసేవాళ్లు కొందరు ఉంటారు. ఇష్ట పూర్వకంగానే పులిని ఎక్కుతారు. సవారీలో అలిసిపోయిన తర్వాత గానీ.. దిగితే ఆ పులి తినేస్తుందనే వాస్తవం వారికి బోధపడదు. ఆ పులి కూడా తామే అయి- ఆత్మహత్య చేసుకుంటారు. ‘కెరీర్ కోసం’, ‘భవిష్యత్తుకోసం’ అనే ముసుగులో.. కొన్ని సందర్భాల్లో డబ్బుకోసం దారితప్పి ప్రవర్తించే వాళ్లు.. దారి తప్పిన బంధాలను కోరుకునే వాళ్లు.. ఒక హిపోక్రసీతో జీవితంలో మధురిమలను ఆస్వాదిస్తున్నట్లుగా భ్రమిస్తూ గడిపేవాళ్లు.. ఏదో ఒక నాటికి ఆశలకు- వాస్తవాలకు మధ్య వ్యత్యాసాన్ని భరించలేక చావును ఆశ్రయిస్తుంటారు. ఇది రెండో రకం.

మొన్నటి బాలీవుడ్ సుశాంత్ సింగ్, సమీర్ శర్మ విషయంలో అయినా, నిన్నటి టాలీవుడ్ శ్రావణి విషయమైనా, ఇవాళ్టి కోలీవుడ్ చిత్ర పాండ్యన్ అయినా, తమిళ పరిశ్రమలో అన్నా చెల్లెళ్లు శ్రీధర్, జయకల్యాణి అయినా అందరూ ఈ వర్గీకరణకే చెందుతారు.

Also Read ;- ప్రవాస ప్రేమ : ప్రణయ్ ఆత్మహత్యే చివరిది కావాలి !

చావును వరించి తెచ్చుకోవడమే..

జీవితంలో అన్నింటికంటె పెద్ద కష్టం ‘చావు’! ఈ స్పృహ ఉంటే ఏ మనిషినీ ఏ కష్టమూ పెద్దగా బాధించదు. అసలైన కష్టం- మనం అధిగమించగలిగేది కాదు. దాని ముందు ఏ కష్టం వచ్చినా- భయపడడంలో అర్థం లేదు. కానీ.. ఆశలను అందుకోవడానికి ఉండే దూరం ఒక స్థాయిని మించిపోయిన తర్వాత.. ఇక ఎప్పటికీ అందుకోలేమని భావించినప్పుడు జీవితం అక్కర్లేదని అనిపిస్తుంది. చావును కోరుకుంటారు. మనం కోరుకోగానే అది రాదు కదా! రామాయణం సుందరకాండలో ఒక శ్లోకం ఉంటుంది.

లోకప్రవాదో సత్యో2యం పండితై స్సముదాహృతః |

అకాలే దుర్లభో మృత్యుః స్ర్తియా వా పురుషస్య వా ||

‘ఆడవాళ్లయినా, మగాళ్లయినా.. ఎవ్వరికైనా సరే.. కోరుకున్నంత మాత్రాన అకాలంలో చావు రాదు- అన్నమాట నిజం’ అని ఈ శ్లోక భావం. మనం కోరుకుంటే చావు రాదు. కానీ బతుకు మీద ఇచ్ఛ పోయినప్పుడు ఆశ్రయించేదే ఈ బలవన్మరణం- ఆత్మహత్య! చావు వచ్చేదాకా ఆగలేని, అంతవరకు రాగల ప్రతికష్టాన్నీ గెలవగలమనే విశ్వాసం లేని.. వాళ్లు చేసే పని ఇది.

ఈ సత్యం తెలిస్తే ఆత్మహత్య చేసుకోరు..

సాధారణంగా కష్టాల్లో ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఉన్నవారు.. సుందరకాండ పారాయణం చేస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పద్యాలు చదవగానే మంచి జరిగిపోతుందా.. అనే సందేహం మనకు రావొచ్చు. ప్రాక్టికల్‌గా చూసినప్పుడు ఇక్కడ ఒక కీలకమైన లాజిక్ ఉంది. సుందరకాండ మొత్తం సీతమ్మ కష్టాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. రామాయణంలో సీత పాత్రను గమనిస్తే ఆరేళ్ల వయసులో పెళ్లి చేసుకుంది.. పసివయసులో ఆ భోగం 12 ఏళ్లే! 18ఏళ్ల వయసులో భర్త వెంట వనవాసానికి వెళ్లింది. వనవాసం చివర్లో 10 నెలల పాటు రావణుడి చెరలో ఉంది. తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చింది. ఆ వెంటనే మళ్లీ రాముడు పరిత్యజించడంతో వాల్మీకి ఆశ్రమానికి వెళ్లి అక్కడో 12ఏళ్లు గడిపింది. జీవితమంతా కష్టాలే. ప్రత్యేకించి సుందరకాండ మొత్తం సీత కష్టాలే ప్రధానంగా వర్ణన ఉంటుంది. పైగా వాల్మీకి రామాయణంలో వర్ణనలు చాలా ఎక్కువగా ఉంటాయి. సీత కష్టాలను రకరకాలుగా వర్ణించి చెబుతాడు వాల్మీకి! ఇదంతా గమనించినప్పుడు.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సుందరకాండ చదివితే.. బహుశా మనం అనుభవిస్తున్న వాటికంటె పెద్ద పెద్ద కష్టాలు అందులో కనిపిస్తాయి. మనకు తెలియకుండానే ఆ కష్టాలతో పోల్చుకుని కొంత ఊరట పొందడం జరగొచ్చు. అందుకేనేమో సుందరకాండ చదివితే కష్టాలు తొలగుతాయంటారు.

ఇవాళ మన టీవీ యాంకర్లు, నటులు, సెలబ్రిటీలు, విద్యార్థులు, రైతులు, గృహిణులు కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. మరి మనందరి ఎక్కువ కష్టాలు పడిందని మనం చెప్పుకుంటున్న సీతమ్మకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించలేదా? సీతకు కూడా ఆత్మహత్య ఆలోచన వచ్చింది!!

సీత ఆత్మహత్య ఆలోచన

వాల్మీకి వర్ణించిన మేరకు ఎద భాగం మొత్తం తడిచిపోయేంతగా సీత అశోకవనంలో ఏడుస్తూనే ఉంది. ఒకవైపు తనకు కాపలాగా ఉన్న ఆడరాక్షసుల బెదిరింపులు, రాముడు వచ్చి తనను తీసుకెళ్తాడనే నమ్మకం ఉన్నప్పటికీ.. అది ఎప్పటికి జరుగుతుందో ఈలోగా ఏమౌతుందో అనే భయం.. వెరసి ఆమెలో ఆత్మహత్య ఆలోచన ప్రవేశించింది. రామాయణం- సుందరకాండలో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఓ అద్భుతమైన శ్లోకం ఉంటుంది. అది చదివితే.. సారం బోధపడితే క్షణికావేశంలో తీవ్రమైన ఆ ఆలోచన చేసే ఎవ్వరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడరు!

ఇంతకూ ఆ శ్లోకం ఏంటంటే..

ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతామ్ |

న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మచ్ఛందేన జీవితమ్ ||

‘మనిషి జీవితం అంటేనే పాపాలను పుణ్యాలను విచక్షణతో చూడగలిగిన వివేకం గలది. అందువల్ల- ఆత్మ ధరించి ఉన్న ఈ జీవితాన్ని విడిచిపెట్టడం నాకు అసాధ్యం’ అని ఈ శ్లోక భావం. సింపుల్ గా మన మాటల్లో చెప్పుకోవాలంటే.. మంచి చెడుల విచక్షణ ఉండే మనిషిని గనుక.. నేను ఆత్మహత్య చేసుకోలేను అని సీతమ్మ అనుకున్నదట.!

మన వ్యక్తిత్వాన్ని నిండుగా తీర్చిదిద్దే.. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మహత్య ఆలోచన కూడా దరికి చేరనివ్వకుండా ఉండే స్థైర్యాన్నిచ్చే శ్లోకం ఇది. మనకు మాత్రమే మంచి చెడు తేడా తెలుసు.

మనుష్యత్వం అనేది పుణ్య పాప విచక్షణ చేసే వివేకం కలిగినది.  అందువల్ల ఈ జీవితాన్ని త్యజించడానికి మనకు అవకాశం, అధికారం లేదని తెలుసుకోవాలి. జ్ఞానం, సంపద, స్థాయి హోదా వేటితోనూ నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరిలో తగిన నిబ్బరం, ధైర్యం ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఇలాంటి విచక్షణ ఉండాలని, అది ఎప్పుడూ అదుపు తప్పకూడదని కోరుకుందాం.

.. సురేష్ పిళ్లె

kamspillai@gmail.com

Also Read ;- ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ.. నిరాకరించిందని యువతి గొంతు కోసిన ప్రియుడు

Tags: black side of suicidechitra pandian sucidiechitra suicideleotoppandian storestamil anchor chitratamil vj chitraVJ Chitra Pandianwhy people commit suicide
Previous Post

చై – సామ్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఎన్నున్నాయో తెలుసా?

Next Post

సలార్’ కోసం ఆడిషన్స్ .. ఎవరైనా ట్రై చేయొచ్చునట!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

ఆ డబ్బుకు లెక్క చెబితే.. బ్యాండ్ పడేది ఎవరికి?

భారత్ బయోటెక్, సీరం, జైడస్.. ఏది ముందు?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist