ఎవరేమన్నా వినకుండా గవర్నర్ దగ్గర సంతకాల తంతు కూడా పూర్తిచేయించింది. కానీ చవరికి ప్రతిపక్షాల నుండి మీడియా వరకు నిరసన గళాలు వెల్లువెత్తడంతో దానిని నిలుపుదల చేసి అసెంబ్లీలో అందరి అభిప్రాయం తీసుకుంటామని వెల్లడించింది. మరి అంత వివాదస్పదంగా మారిన చట్టం ఏమిటి?
సహజమైపోయింది
ఎవరిపైనైనా కోపం వస్తే ఏం చేస్తాం? వారి దగ్గరకు వెళ్లి తిట్టడం లాంటివి చేస్తాం లేదా కనీసం ఫోన్ చేసి తిట్టి మన కోపం చల్లార్చుకుంటాం. కానీ నేడు ఇదంతా పాత పద్ధతి అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా మన ప్రత్యర్ధులపై విరుచుకుపడడమే నేటి ట్రెండ్ గా మారింది. రాను రాను విచక్షణ కోల్పోతున్నారనేది నిజం. సోషల్ మీడియా వేదికగా తిట్టడమే కాదు, బెదిరించడం, నచ్చని వారి గురించి అసభ్య ప్రచారం చేయడం, కించపరచడం శృతి మించిపోతున్నాయనే చెప్పాలి. కానీ ఇలాంటి వాటిని అడ్డుకట్టవేయాలంటే అది పారదర్శకత కలిగిన చట్టాల ద్వారానే సాధ్యమవుతుంది. అంతేకానీ, ఎవరేం మాట్లాడినా జైల్లో పెడతామంటే, దాని వల్ల దుర్వనియోగమే తప్ప న్యాయం జరగదు.
Also Read:-సోషల్ మీడియా పొంచి ఉంది.. అవినీతి పరులూ జాగ్రత్త
కొత్త చట్టంతో వివాదం
కేరళ ప్రభుత్వం పోలీస్ సవరణ చేసి ‘118 ఎ’ కొత్త చట్టన్ని రూపొందించింది. అందులో భాగంగా, ఏ మీడియం ద్వారా అయినా సరే, ఏ సబ్జెక్ట్ మీదైనా ఎదుటివారిని బెదిరించినా, కించపరచినా, తిట్టినా, నిరాదారమైన ఆరోపణలు చేసి వారి గౌరవానికి భంగం కలిగించినా… అలాంటి వారిని ఈ చట్టం ద్వారా కేసు నమోదు చేసి సంవత్సరం నుండి మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు 10,000 వరకు ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Must Read:-కేరళ స్ఫూర్తితోనే ఈ మీమ్స్
చట్టంతో రాజుకున్న మంట
ఈ చట్ట సవరణని ప్రకటన చేసిన క్షణం నుండి ప్రతిపక్షాల, మీడియా సంస్థలు, ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ చట్టం ద్వారా సోషల్ మీడియా, ప్రచురణల ద్వారా ఇతరల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నవారికి ముకుతాడు వేయచ్చునే విషయం ఎంత నిజమో, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందనడంలో సందేహం లేదు. వెను వెంటనే ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. మీడియా, పత్రికల సంస్థలు కూడా ప్రభుత్వం తమ స్వేచ్ఛను హరిస్తుందని నిరసన గళాన్ని వినిపించాయి.
భావ ప్రకటనకు వ్యతిరేకం కాదు
దీనిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి, ఈ చట్టం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడానికి కాదంటూ ప్రకటన విడుదల చేశారు. చట్టానికి లోపడి, నిష్పక్షపాతంగా వ్యవహారిస్తూ, రాజ్యంగానికి లోపడి పనిచేసే సంస్థలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. కానీ, చట్ట సవరణలోని వివరాల ప్రకారం మీడియా, పత్రికల స్వేచ్ఛ భంగం వాటిల్లుతుందని స్పష్టంగా ఉంది. ఈ చట్టం వల్ల ప్రభత్వ వ్యతిరేక అభిప్రాయాలను బహిర్గతంగా ప్రకటించాలన్నా భయపడే పరిస్థితి ఉందనేది విస్పష్టం.
దిగొచ్చినా ప్రభుత్వం
ఎవరెన్ని చెప్పినా పెడచెవిన పెట్టిన పినరాయి విజయన్ ప్రభుత్వం చట్ట ఆమోదం పొందడానికి గవర్నర్ చేత కూడా సంతకాల ప్రక్రియను పూర్తిచేయించింది. కానీ, అన్నివైపులు నుండి వస్తున్న వ్యతిరేకతను, నిరసన గళాన్ని అడ్డుకోలేక, సమాధాన పరచలేకపోయిన ప్రభుత్వం చివరికి దిగొచ్చింది. చట్ట అమలుని నిలుపుదల చేసి అసెంబ్లీలో చర్చించి అన్నీ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటామని ముఖ్యమంత్రి మీడియా సముఖంగా ప్రకటించారు.
Also Read:-బీహార్ కన్నా దారుణమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్











