హైదరాబాద్ లో కమలం జెండా ఎగురవేయడం అంత ఈజీ కాదని వారికి త్వరలో తెలిసి రానుంది. దుబ్బాక వేవ్ ను బీజేపీ కీలకనేతలు అప్పుడే వాడేసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఎన్నికల్లో కొన్ని డివిజన్ల సీట్లు అమ్ముకున్నారని ఆ పార్టీకి చెందిన గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు ఆ పార్టీకి పెద్ద మచ్చగా మిగలనున్నాయి.
Must Read:-దుబ్బాక ఎన్నికల్లో గెలిచినా సరే.. హైకోర్టుకు వెళ్లిన రఘునందన్!
కార్పొరేటర్ సీట్లు అమ్ముకున్నారా?
గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్ సీట్లు అమ్ముకున్నారని బీజేపీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నిజమైతే, ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో అలా గెలిచారో లేదో అప్పుడే బేరాలు మొదలు పెడితే ఇక పార్టీకి భవిష్యత్తు ఏం ఉంటుంది. సొంత పార్టీ సీనియర్ నేత, గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించినట్టుగా ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అయితే ఇది నిజమేనని కూడా సమాచారం వస్తోంది.
Must Read:-అల్లుడు జగన్ మీద అప్పుడే విరక్తి పుట్టిందా?
గోషామహాల్ అసెంబ్లీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారికి సీట్లు ఇవ్వకుండా, టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు నిజాయితాగా వెళితే అక్కడ రాజాసింగ్ చెప్పిన వారికి సీట్లు కేటాయించి, వారిని గెలిపించుకునే బాధ్యత కూడా అతనికే అప్పగించాలి. కానీ అలా జరగలేదు. చివరి క్షణంలో పేర్లు తారుమారు కావడంతో బీజేపీ నేతలు సీట్లు అమ్ముకున్నారనే వార్త వైరల్ గా మారింది. ఇదే నిజమైతే ఇక బీజేపీ భవిష్యత్తు పెద్దగా ఊహించుకోలేం.
Also Read:-‘గ్రేటర్’ తీర్పు పొంచి ఉంది.. టీఆర్ఎస్ ఖబడ్దార్!
హైదరాబాద్ లో 25 డివిజన్లు గెలిస్తే గొప్ప
గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి పెద్దగా పట్టులేదు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది 4 డివిజన్లే. అంటే వారి పట్టు ఏ పాటిదో అర్థం అవుతుంది. ఈ సారి దుబ్బాక ఊపులో ఉన్నారు. నిధుల కొరతలేదు. కేంద్ర బీజేపీ పెద్దలు కూడా హైదరాబాద్ లో మకాం వేసి ఎలాగైనా మంచి ఫలితాలు సాధించాలని వ్యూహాలు వేస్తున్నారు. ఇంత చేసినా బీజేపీ హైదరాబాద్ ఎన్నికల్లో 20 నుంచి 25 డివిజన్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ జరిపించిన సర్వేలో తేలిందట. ఈ మాత్రం దానికి ఇంత హడావుడి ఎందుకు. మరీ ఎక్కువ హడావుడి చేసినా, జనం రివర్స్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.
హైదరాబాద్ వరదలు, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం లేకుండా అసలు హైదరాబాద్ బీజేపీలో ఇంత హడావుడి ఉండేదా? ఏదో ఒక అసెంబ్లీ సీటు గెలిచి ఒక రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్నంత హడావుడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఏపార్టీ అధికారం చేజిక్కించుకోవాలన్నా కనీసం 76 డివిజన్లు గెలవాలి. అందులో మూడోవంతు గెలిచే అవకాశం ఉన్న బీజేపీ, ఇక తెలంగాణ అంతా మా చేతుల్లోకి వచ్చినట్టేనన్న భ్రమల్లో ఉన్నట్టు అనిపిస్తోంది.
Also Read:-బీజేపీ వైపు నేతల చూపు..
అప్పుడే ఇంత హడావుడా?
ఒక వేళ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 4 నుంచి ఒకేసారి 40 డివిజన్లు గెలిచినా అది ఆ పార్టీ బలం కాదు. హైదరాబాద్ లో ఇటీవల వచ్చిన వరదలకు ముఖ్యంగా గరీబోళ్లు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక హైదరాబాద్ రోడ్లు, కరోనా వైరస్ కన్నా ఎక్కువ భయపెడుతున్నాయి. ఇప్పటికీ ప్రధాన రహదారులు మినహా కాలనీల్లో రోడ్లు బాగుపడలేదు. ఇవన్నీ బీజేపీకి కలసి వచ్చే అంశాలు. ఇవి తాత్కాలికం. పార్టీ క్యాడర్ ను పెంచుకోవడం. ప్రజలకు భరోసా ఇవ్వడం చేయకుండా, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు చూసుకుని తొడకొట్టుకుంటే చాలా ప్రమాదం. ఇక హైదరాబాద్ లో బీజేపీ ఓడిపోతే మాత్రం, కేసీఆర్ ఆపార్టీని, ఆ పార్టీ నేతలను చీల్చి చెండాడుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.