పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ఎనౌన్స్ చేసిన మూవీ సలార్. ఈ పాన్ ఇండియా మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రబాస్ ఇప్పటి వరకు ప్రకటించిన సినిమాల్లో ఈ మూవీని లాస్ట్ ప్రకటించినప్పటికీ.. సెట్స్ పైకి మాత్రం వాటన్నింటి కంటే ముందు వస్తుంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో నటించే ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ కూడా ప్లాన్ చేసారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో ఈ ఆడిషన్స్ ప్లాన్ చేసారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నారని.. ఓ వార్త బయటకు వచ్చింది. మోహన్ లాల్.. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. తెలుగులో మోహన్ లాల్ ‘జనతా గ్యారేజ్, మనమంతా’ మూవీస్ లో నటించారు. ఆ రెండూ బాగా పే చేశాయి. అలాగే అంతకు ముందు హిందీలో మోహన్ లాల్ నటించిన కంపెనీ సినిమా కూడా సక్సస్ అయ్యింది. అందుకే ఈ సినిమాలో మోహన్ లాల్ నటిస్తే.. సలార్ మూవీకి మరింత క్రేజ్ ఏర్పడుతుంది అనుకుంటున్నారట మేకర్స్.
మోహన్ లాల్ తో సంప్రదింపులు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు గాను మోహన్ లాల్ కు 20 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలిసింది. ప్రభాస్ – మోహన్ లాల్ కాంబినేషన్ అంటే.. సలార్ పై మరింత క్రేజ్ ఏర్పడడం ఖాయం. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి.. పక్కా ప్లాన్ తో సమ్మర్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. మరి.. అన్నీఅనుకున్నట్టు జరిగి మోహన్ లాల్ ఈ మూవీలో నటిస్తారేమో చూడాలి.
Must Read ;- సలార్’ కోసం ఆడిషన్స్ .. ఎవరైనా ట్రై చేయొచ్చునట!











