సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది. కారణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.
అయితే.. మహేష్ తో సినిమా చేయడానికి వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి కూడా రెడీగా ఉన్నారు. దీంతో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా రెడీగా ఉన్నారు. ఇలా డైరెక్టర్స్ మహేష్ తో సినిమా చేయడానికి రెడీగా ఉండడంతో మహేష్ తదుపరి చిత్రం ఎవరితో అనేది అటు అభిమానుల్లోను కాకుండా ఇండస్ట్రీలో కూడా ఆసక్తిగా మారింది. అయితే.. ఇటీవల వెంకీ కుడుముల మహేష్ కి కథ చెప్పారని.. ఈ కథకు మహేష్ ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు ఓ ఇంట్రస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. వెంకీ కుడుములకి మహేష్ తో మీటింగ్ ఏర్పాటు చేసింది బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ అట. ఆయనే వెంకీ దగ్గర ఉన్న కథ విని.. మహేష్ కి బాగుంటుందని పంపించారట. లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ్ మని మహేష్ చెప్పారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మహేష్ – వెంకీ కుడుముల ప్రాజెక్ట్ సర్కారు వారి పాట తర్వాత ఉంటుందని తెలిసింది.
Must Read ;- చిరు, మహేష్ మూవీలో నటించడం పై క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్











