సూపర్ స్టార్ మహేష్ బాబు – గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే.. కరోనా కారణంగా షూటింగ్ స్టార్ట్ కావడానికి ఆలస్యం అయ్యింది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసారు. అయితే.. అక్కడ కరోనా ఇంకా తగ్గకపోవడంతో హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ లో ఎక్కడ షూటింగ్ చేయనున్నారంటే.. రామోజీ పిలింసిటీలో ఈ సినిమా కోసం అమెరికా బ్యాంక్ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సీన్స్ కోసమే అమెరికా వెళ్లాలి అనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ షూటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకనే రిస్క్ ఎందుకుని ఇక్కడ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో విలన్ అంటూ అరవిందస్వామి, ఉపేంద్ర, అనిల్ కపూర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఎవర్నీ ఇంకా కన్ ఫర్మ్ చేయలేదని తెలిసింది.
త్వరలోనే విలన్ ఎవరు అనేది ఫైనల్ చేసి అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళుతున్న మహేష్ ‘సర్కారువారి పాట’ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- మహేష్ బాబు గారాల పట్టి సితార విడుదలచేసిన ‘ఫంటాస్టిక్ తారా’ టీజర్