దేశంలో అతి పెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన రైల్వే సంస్థ సైతం పలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. నివారణ చర్యల దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రైల్వే జోన్ పరిధిలోని 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు కారణాలు లేకపోలేదు.. రైల్వే సంస్థ మూసివేస్తోన్న ఈ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ అంతంత మాత్రమే ఉంటున్న కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అములులోకి వస్తుందని.. మొదటగా 29 స్టేషన్లు మూతపడతాయన.. ఆ తర్వాత ఏప్రిల్1 నుంచి మిగిలిన 2 రైల్వే స్టేషన్లు కూడా మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ 30 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిధిలోనివే కావడం గమనార్హం. కేవలం ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్ జిల్లాలో ఉంది.
ఇక డివిజన్ల వారీ వివరాలు విషయానికొస్తే.. సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ పరిధిలో 7, గుంతకల్ పరిధిలో 3, గుంటూరు రైల్వే పరిధిలో 4, ఇక మిగిలినది నాందేడ్ పరిధిలోకి రానుంది. హఠాత్తుగా, 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా ఇప్పటికే చాలా నష్టపోయిన రవాణ సంస్థ, నివారణ చర్యల్లో భాగంగానే వ్యవహరిస్తుందని అధికారులు చెప్తున్నారు. వీటిని కేవలం తాత్కాలికంగా మాత్రమే మూతవేసే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికల రద్దీ పెరిగిన తర్వాత.. వీటిని పునరుద్ధరించే అవాకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
Must Read ;- రైల్వే ప్రయాణికులకు ‘డిస్పోజబుల్ ట్రావల్ కిట్’..











