కెరియర్ తొలినాళ్లలో నాగచైతన్య కాస్త తడబడినా, ఆ తరువాత నుంచి ఆయన పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘లవ్ స్టోరీ‘ ముస్తాబవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ‘థ్యాంక్యూ‘ అనే టైటిల్ ను సెట్ చేశారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
విక్రమ్ కుమార్ వినిపించిన కథ కూడా చాలా కొత్తగా ఉందట. అందువలన కథ వినగానే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో చైతూ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చైతూ చెప్పడాన్ని బట్టి చూస్తుంటే, ఈ కథపై ఆయన బలమైన నమ్మకంతో ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ముస్తాబవుతూ ఉండగానే, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతూ ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడనే టాక్ వినిపిస్తోంది.
తరుణ్ భాస్కర్ తను రెండు కథలను సిద్ధం చేసి, నిర్మాత సురేశ్ బాబుకు వినిపించినట్టుగా ఓ ఇంటార్వ్యూలో చెప్పాడు. ఆ రెండు కథలు సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్నట్టుగా చెప్పాడు. అందులో ఒక సినిమాలో వెంకటేశ్ చేయనున్నట్టుగా ఇటవల వార్తలు వచ్చాయి. మరో కథలో చైతూ హీరోగా చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ కథ చైతూకు చాలా బాగా నచ్చిందని అంటున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడట. అదే నిజమైతే కచ్చితంగా చైతూకు అది డిఫరెంట్ రోల్ అవుతుందనే చెప్పాలి.
Must Read ;-నాగచైతన్య వెర్సెస్ నానీ











