ప్రేమ అనేది ఒక అందమైన సబ్జెక్టు .. అర్థమైనట్టుగా, కానట్టుగా అనిపించే సబ్జెక్టు. మళ్లీ మళ్లీ చదవాలనిపించే సబ్జెక్టు .. ఎన్నిమార్లు చదివినా అప్పుడే అయిపోయిందా అనిపించే సబ్జెక్టు. ఎప్పుడూ కొత్త కథలా కనిపిస్తుంది .. కొత్త పాటలా అనిపిస్తుంది కనుకనే, ప్రేమకథలకు ఆరాధకులు ఎక్కువ .. ఆదరణ ఎక్కువ. అలాంటి ప్రేమకథలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించే టాలీవుడ్ దర్శకులు ఎవరయ్యా అంటే, ముందుగా శేఖర్ కమ్ముల పేరే వినిపిస్తుంది. సున్నితమైన ప్రేమకథను సున్నుండలా తయారుచేసి అందించే నేర్పు ఆయన సొంతం.
సాధారణంగా సినిమాలను యూత్ ఎక్కువగా చూస్తారు .. ప్రేమకథలనైతే మళ్లీ మళ్లీ చూస్తారు. ఇక థియేటర్లు కూడా ప్రేమకథలను పోషించడానికే ఎక్కువ ఆసక్తిని చూపుతూ ఉంటాయి. అలాంటి ప్రేమకథల స్పెషలిస్టుగా మంచి మార్కులు కొట్టేసిన శేఖర్ కమ్ముల, తన తాజా చిత్రంగా ‘లవ్ స్టోరీ‘ సినిమాను రూపొందించాడు. నాగచైతన్య – సాయిపల్లవి జంటగా ఈ సినిమా నిర్మితమైంది. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఏప్రిల్ 16వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. అదే రోజున నాని ‘టక్ జగదీశ్‘ విడుదల ఉండటంతో, ‘లవ్ స్టోరీ’ రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
కానీ ‘లవ్ స్టోరీ’ సినిమాను ఏప్రిల్ 16వ తేదీనే విడుదల చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ రిలీజ్ డేట్ తో కూడిన కొత్త పోస్టర్ ను కూడా వదిలారు. చైతూ .. సాయిపల్లవి ఇద్దరూ కలిసి గాలిపటాలు ఎగరేస్తూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. చాలా నేచురల్ గా ఉన్న ఈ పోస్టర్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.’ఆనంద్’ .. ‘గోదావరి’ .. ‘ఫిదా‘ వంటి అద్భుతమైన ప్రేమకథల తరువాత శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ ప్రేమకథపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చైతూకు .. సాయిపల్లవికి కూడా ప్రేమకథలు కలిసొచ్చాయి గనుక, ఈ సినిమా హిట్టుకొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Must Read ;- నాగచైతన్య వెర్సెస్ నానీ
The world of #LoveStory in theatres on April 16th!#LoveStoryOnApril16th@chay_akkineni @Sai_Pallavi92@sekharkammula #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @NiharikaGajula @GskMedia_PR @adithyamerugu @SVCLLP pic.twitter.com/xaqwMGpH3U
— BARaju (@baraju_SuperHit) January 25, 2021