పరీక్షలు కన్నా విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.కరోనా కల్లోల సమయంలో వాయిదాల పేరుతో విద్యార్థులను ఆందోళనకు గురి చేయకుండా టెన్త్,ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.దీనిపై బుధవారం ఉదయం 11 గంటలకు జూమ్ యాప్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, తల్లితండ్రులు, విద్యావేత్తలు పరీక్షల రద్దుపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.మీరు కూడ ఇందులో పాల్గొని మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు.
Must Read ;- అన్నగా ఆదుకుంటా : కుటుంబ పెద్దల్ని కోల్పోయిన విద్యార్థికి లోకేశ్ భరోసా











