టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి సోగ్గాడే చిన్ని నాయానా. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో సంచలన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ గా బంగార్రాజు మూవీ చేయాలని నాగార్జున ఫిక్స్ అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయానా సినిమా తర్వాతే నాగార్జున బంగార్రాజు అనే టైటిల్ రిజిష్టర్ చేయించారు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగార్రాజు కథ పై కసరత్తు జరుగుతూనే ఉంది కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు.
తాజా సమాచారం ప్రకారం.. త్వరలో బంగార్రాజు మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య సరసన సమంత నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. సమంత బిజీగా ఉండడం వలన సున్నితంగా తిరస్కరించిందట. ఆతర్వా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి అయితే బాగుంటుందని కాంటాక్ట్ చేశారు. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి కృతి కన్ ఫర్మ్ అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ మేటర్ ఏంటంటే..
కృతి శెట్టిని అనుకోవడం.. కాంటాక్ట్ చేయడం నిజమే కానీ.. ఇంకా కన్ ఫర్మ్ కాలేదని తెలిసింది.
కృతి అడిగినంత పారితోషికం ఇస్తామన్నా.. కృతి వరుస సినిమాలతో బిజీగా ఉండడం వలన ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదట. ఈ ప్రాజెక్టుని ఇంకా హోల్డ్ లోనే పెట్టినట్టు తెలుస్తోంది. కృతి కాల్షీట్లు కుదిరితే.. ఓకే. లేదంటే మరో కథానాయిక ని చూసుకోవాలి. అందుచేత బంగార్రాజు మూవీలో కృతి శెట్టి నటిస్తుందా..? లేదా..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- కృతి శెట్టి తరువాత ఆ రేంజ్ లో జోరు చూపించేదెవరు?











