రాజధానిలో ఎమ్మెల్యే శ్రీదేవికి దిమ్మతిరిగేలా ఫలితాలు!
ఏపీ రాజధాని నియోజకవర్గం తాడికొండలో ప్రజలు వైసీపీని, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఛీ కొట్టినట్లు తెలుస్తోంది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. రెండు స్థానాలను కైవసం చేసుకుని మండలంలో తిరుగులేని విధంగా పార్టీని నిలబెట్టారు తమ్ముళ్లు. గుండాలపాడులో 457 ఓట్లు, వేమవరం 93 ఓట్లు మోజారిటీ రెండు స్థానాల్లో గెలుపు బావుట ఎగరవేసింది. రాజధాని నియోజకవర్గంలో అది అధికారపార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిథిలో రెండు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా పాతడం విశేషం. అలానే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొరుటూరు ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ 429 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకొంది. అలానే పెదవేగి మండలంలో రామశింగవరం ఎంపీటీసీ స్థానాన్ని 87 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుచుకుంది. పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీని టీడీపీ అభ్యర్థి 27 ఓట్లతో విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా టీడీపీ, జనసేన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించి ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
స్పీకర్, మంత్రి బొత్స నియోజకవర్గాల్లో సత్తా చాటిన తమ్ముళ్లు!
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ‘తెలుగు దేశం’తన హవాను కొనసాగించింది. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస మండలం, కట్యాచర్లపేట ఎంపీటీసీ స్థానాన్ని 256 ఓట్లు మెజారిటీతో టీడీపీ విజయం సాధించగా .. కంచిలి మండలం కుమ్మారినాగోం లో 161 ఓట్ల మెజారిటీతో సొంతం చేసుకుంది. కొత్తూరు మండలం భీమిలి ఎంపీటీసీ స్థానాన్ని 125 ఓట్ల మెజారిటీ, బూర్జి ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ 112 ఓట్ల మెజారిటీ గెలుపు ఢంకా మోగించింది టీడీపీ. అలానే విజయనగరంలో జిల్లా భూసాయివలస ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ 623 ఓట్లతో కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. స్పీకర్ తమ్మినేని, బొత్స సొంత నియోజకవర్గాలలో జరిగిన ఈ పరిషత్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీటీసీ స్థానాలను, అధిక మెజారిటీతో టీడీపీ గెలుచుకోవడం ఉత్తరాంధ్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో బేతంచర్లలో మంత్రి బుగ్గన సొంత వార్డుల్లో టీడీపీ విజయ కేతనం ఎగరవేస్తే .. ఈనాటి పరిషత్ ఎన్నికల్లో స్పీకర్ తమ్మినేని, మంత్రి బొత్స సత్యనారాయణలకు వారి సొంత నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుని టీడీపీ పట్టునిలుపుకొందని పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
Must Read ;- బేతంచర్ల స్పూర్తే.. తమ్ముళ్లకు ఆదర్శం!











