కవర్ పేజ్‌ని చూసి.. ఆ పుస్తకాన్ని అంచనా వేయకూడదు.. ఇది కేవలం పుస్తకాలకే కాదు.. మనుషులకు కూడా వర్తిస్తుంది. కొందరు చూడడానికి ఎంతో సున్నితత్వమైన వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ, వారి ఆలోచనా విధానం ఎంతో లోతుగా, అంతుచిక్కని విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొందరి ఆడవారి విషయంలో ఇది కచ్చితంగా వర్తిస్తుందని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో ఎత్తులకు పైఎత్తులు వేయగల వారి తెలివితేటల ముందు కండలు తిరిగిన వీరులైనా.. రాజ్యలు గెలిచిన ఎంతటి గొప్పవారైనా.. సరిపోలరు. ఇలాంటి కోవలోకి వస్తారు నార్త్ కొరియా నియంత కిమ్ ఉన్ జోంగ్ చెల్లెలు కిమ్ యో జోంగ్.
‘బ్యూటీ విత్ బ్రెయిన్’.. ఈ మాట అక్షరాల కిమ్ యో జోంగ్ వర్తిస్తుంది. మనసులను ఇట్టే దొచేయగల అందం ఆమె అందం. కానీ అది మాత్రమే అనుకుంటే మీరు పొరబడ్డట్టే.. అంతకు మించి దేశ రాజకీయాల్ని ఒక్క మాటతో శాసించగల శక్తి కిమ్ యో జంగ్‌కు ఉందనేది అక్షర సత్యం. కిమ్ ఉన్ జోంగ్ పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలు అమ్మో అతనా.. ఎంతో కర్కసమైన వ్యక్తి.. నియంత అంటూ భయపడతారు. అటువంటి వ్యక్తి సైతం కిమ్ యో జోంగ్ మాట వినాల్సిందే.
నార్త్ కొరియాలోని ప్రతి ప్రభుత్వ పాలసీ కిమ్ యో జోంగ్ కనుసన్నల్లో నడవాల్సందే అని వినికిడి. తన అనుమతి ముద్ర లేకుండా ఏ పథకం కూడా ప్రజల్లోకి వెళ్లడం అసాధ్యం. కొన్నాళ్ల క్రితం కేవలం తెరవెనక ఉండి నడిపిస్తున్న కిమ్ యో , 2018 కిమ్-ట్రంప్ చర్చల నేపథ్యంలో వెలుగులోకి వచ్చారు. అమెరికా అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన మూడు సమావేశాలకు కిమ్ ఉన్‌తోపాటు తన చెల్లెలు యో కూడా హాజరయ్యారు. ఈ చర్చలు సఫలమవడంలో కిమ్ యో జోంగ్ పాత్ర కీలకమైనది. ఆపైన కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి కూడా కిమ్ యో కృషి చేశారని చెప్తుంటారు. ఎన్నో సందర్భాల్లో అన్న అండగా నిలబడిన చెల్లెలుగా ఆ తర్వాత మరింత వెలుగులోకి వచ్చారు. మెల్లగా ఆమె గురించిన నిజాలు కూడా ప్రపంచానికి కూడా తెలిశాయి. ఆమె సామర్థ్యం అపారం.. అంచానా అంతుపట్టనిది.. రాజకీయ రణరంగంలో తలపండిన నేతలు సైతం ఈ 32 ఏళ్ల మహిళ ముందు నిలవలేరనడంలో ఎటువంటి సందేహం లేదు.
కిమ్ యో ఎప్పుడు జన్మించారనే దానిపైన క్లారిటి లేకపోయినా.. నార్త్ కొరియా డేటా ప్రకారం ఆమె 1988లో జన్మించారు. ప్రభుత్వం సమాచారం ప్రకారం కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌కి ఆఖరి సంతానం. 2011లో ఆమె తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సందర్భంలో ఆమె మొదటి సారిగా కెమెరాకు చిక్కారు. ఆపై ట్రంప్‌తో చర్చలతో.. ఆమె గురించిన చర్చ మొదలైంది. సరిహద్దుల్లో సైనిక కవాతు నిర్వహించినప్పుడు ఉత్తర కొరియానుద్దేశించి దక్షిణకొరియా తీవ్రంగా హెచ్చరించింది. దానికి మొరిగే కుక్క కరవదంటూ ఆమె చేసిన ప్రకటన దుమారం రేపింది. యో వ్యూహాలు పన్నడంలో దిట్ట.
Must Read ;- ట్రంప్ నోటికి తాళం వెనుక.. తెలుగు అమ్మాయి విజయ గద్దె
కిమ్ తన సొంత నీడను సైతం నమ్మరు.. అటువంటి నియంతకు యో మొదట్నుంచీ నమ్మినబంటు. ఇద్దరూ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో కలిసి చదువుకున్నారు. కిమ్ గద్దెనెక్కిన క్షనం నుండి ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఆమె పాత్ర ఎక్కడా బయటికి పొక్కలేదు. సవాలక్ష తనిఖీలుంటేగానీ కిమ్ ఎవర్నీ కలవడు. యో కి ఇది మినహాయింపు. పాలనాపరంగా కిమ్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆమె పాత్ర, ప్రభావం ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకానొక సందర్భంలో కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోమాలో ఉన్నారని వార్తలు వెలువడిన తరుణంలో ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు చేపట్టబోయేది కిమ్ యో అంటూ అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Also Read ;- మహోన్నత వ్యక్తి.. తిరుగులేని శక్తి