స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ, ‘రంగస్థలం’ హ్యూజ్ సక్సెస్ తర్వాత సుక్కూ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నందున ‘పుష్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా విశేషం సంతరించుకున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటులు కీలకమైన పాత్రల కోసం ఎంపికయ్యారు. ఇప్పుడు మిగిలింది. విలన్ పాత్ర. అది ఇప్పుడు మంచు వారి వారసుడు మంచు మనోజ్ దగ్గర ఆగింది.
నిజానికి పుష్పలో విలన్ గా విజయ్ సేతుపతి నటించాలి. డేట్స్ అడ్జెస్ట్ మెంట్ కుదరకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి అతడి ప్లేస్ లో చాలా మంది పేర్లు వినిపించాయి. ఎట్టకేలకు ఇప్పుడు విలన్ గా మంచు మనోజ్ ఫైనల్ అయ్యాడని వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతుందని సమాచారం. ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘పుష్ప’ కి పాన్ ఇండియా స్థాయిలోనూ మంచి క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో మంచు వారబ్బాయి.. విలన్ గా ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
Must Read ;- అల్లు అర్జున్ తో ప్రశాంత్ నీల్ సినిమా.. నిజమేనా?