అక్కినేని అఖిల్ నటించిన మూడు సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. అఖిల్ నాలుగువ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే.. కరోనా క్రైసిస్ ముగియడం.. ధియేటర్లో 100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ చిత్రాలు థియేటర్లోకి వచ్చేందుకు పోటీపడుతున్నాయి.

అయితే.. దాదాపుగా అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి కానీ.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటి వరకు ఎనౌన్స్ చేయలేదు. దాంతో అక్కినేని అభిమానులు అఖిల్ పై ఫైర్ అవుతున్నారు. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తుంటే.. అఖిల్ మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రిలీజ్ ఎప్పుడో ఎనౌన్స్ చేయకుండా.. సురేందర్ రెడ్డితో సినిమా ఎప్పుడు స్టార్ట్ కానుందో చెప్పకుండా.. సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
సమ్మర్ సీజన్ లో రానున్న సినిమాలు ఆల్ రెడీ ఫిక్స్ అయ్యాయి. ఈ సమ్మర్ సీజన్ లో అఖిల్ సినిమాను రిలీజ్ చేస్తాడో లేదో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. సరైన ప్లానింగ్ లేదు అంటూ అఖిల్ పై విమర్శలు వస్తున్నాయి. మరి.. ఇక నుంచైనా అఖిల్ ప్లానింగ్ మారుతుందో లేదో చూడాలి.
Must Read ;- అక్కినేని బ్రదర్స్ లో విన్నర్ గా నిలిచేదెవరు.?











