తెలుగు తెరపై మలయాళ మగువల జోరు ఎక్కువ .. బాలీవుడ్ భామల సందడి ఎక్కువ. తెలుగు తెరపై తెలుగు అమ్మాయిల ఉనికి ఎక్కడ? అంటే మాత్రం .. ‘మేమున్నాం’ అంటూ ఆన్సర్ ఇచ్చేవాళ్లను వ్రేళ్లపై లెక్కపెట్టొచ్చు. స్వాతి రెడ్డి .. అంజలి .. ఈషా రెబ్బా లాంటి కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఇక్కడ తమ సత్తాను చూపగలుగుతున్నారు. తమదైన ప్రత్యేకతతో ప్రేక్షకులను అలరించగలుగుతున్నారు. వివాహమైన తరువాత స్వాతిరెడ్డి సినిమాలు తగ్గించగా, అంజలి .. ఈషా రెబ్బా మాత్రం తమ జోరును కొనసాగిస్తూనే ఉన్నారు.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ సినిమాతో తెలుగు తెరకి ఈషా రెబ్బా పరిచయమైంది. ఆకర్షణీయమైన కళ్లతో ఈ అమ్మాయి కుర్రకారును బాగానే ఆకట్టుకుంది. అందం తెలుగు అమ్మాయిల హక్కు అనే విషయాన్ని నిరూపించింది. ఆ తరువాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆమె ముందుకు వెళుతోంది. ఒక వైపున మలయాళీ అమ్మాయిల జోరు .. మరో వైపున బాలీవుడ్ ముద్దుగుమ్మల హవా సాగుతున్న నేపథ్యంలో ఆ పోటీని తట్టుకుని నిలబడటం చాలా కష్టం. గ్లామర్ ఒలకబోసే విషయంలో అచ్చ తెలుగు అమ్మాయిలకి ఉండే పరిధి అందుకు కారణం. అయినా అవకాశాలను అందుకుంటూ ఈషా రెబ్బా తన ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తుండటం విశేషం.
సూపర్ హిట్ గా నిలిచిన ‘అరవింద సమేత‘ .. ఫరవాలేదనిపించుకున్న ‘రాగల 24 గంటల్లో’ సినిమాలు ఈషా రెబ్బాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తనని తాను తీర్చిదిద్దుకున్న అందమైన శిల్పంలా ఈ అమ్మాయి కనిపించింది. ఆమె హాట్ లుక్స్ ను కుర్రాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నప్పటికీ, ఇంకా సరైన సినిమాలు పడటం లేదు. మంచి పాత్ర పడితే మాయచేసి గుండెలన్నిటినీ గుత్తాకు తీసుకునే ఆకర్షణీయమైన రూపమే ఆమెది.
తెలుగులో ఆశించినస్థాయి అవకాశాలు కనిపించడం లేదనే ఉద్దేశంతో ఆమె, తమిళ .. కన్నడ సినిమాలపై కూడా దృష్టిపెట్టింది. అక్కడ ఇప్పుడిపుడే అవకాశాలు ఆమె గుమ్మం తొక్కుతున్నాయి. అఖిల్ హీరోగా త్వరలో థియేటర్స్ కి రానున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలోను ఆమె ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా తన కెరియర్ గ్రాఫ్ పెంచుతుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. చూడాలి .. న్యూ ఇర్లో ఆమె కెరియర్ గ్రాఫ్ స్పీడ్ అందుకుంటుందేమో.
Must Read ;- నీరెండలో తేనేటిని సేవిస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్