రీల్ లైఫ్ లో విలన్ గా నటిస్తున్న రియల్ లైఫ్ హీరో సోనుసూద్. కరోనా టైమ్ లో వేలాది మంది వలస కార్మికులకు సహాయం చేసి వాళ్ల ఆకలిని తీర్చాడు. సురక్షితంగా వాళ్ల ఇంటికి చేర్చాడు. వైద్య, సహాయం, ఆర్థిక సహాయం.. ఇలా ఒకటేమిటి కష్టం వచ్చింది అంటే చాలు.. నేనున్నాను అంటూ ముందుకు వచ్చి మనుషుల్లో దేవుడుగా నిలిచాడు. అందరి హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్నాడు.
ఇటీవల కొంత మంది వృద్ధులకు వసతి కల్పించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాకుండా.. వృద్ధులకు వసలి కల్పించడంలో తనతో చేరాలని ఎవరికైనా నివాసం లేని వృద్ధులు కనిపిస్తే తనకు సమాచారం అందించాలని కోరారు. ఈ ఆపధ్బాంధవుడు సోనుసూద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన మనుసులో మాటలను బయటపెట్టాడు. ఇంతకీ సోనుసూద్ ఏం చెప్పారంటే.. సహాయం చేసే తన స్వభావం తన ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా మార్చిందని చెప్పాడు. స్కూలు, కాలేజీల్లో చదువుకునే రోజుల నుంచి ఇతరులకు సహాయం చేస్తుండేవాడినని చెప్పారు.
అయితే.. కరోనా టైమ్ లో చేసిన సేవా కార్యక్రమాలు తనని వేరే స్ధాయికి తీసుకెళ్లాయని చెప్పారు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేయమని చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే.. మంచి కథలను మాత్రమే ఎంచుకుంటున్నాను. త్వరలోనే తెలుగులో రెండు, హిందీలో రెండు సినిమాలు ఎనౌన్స్ చేయనున్నాను అని చెప్పారు. తనని రియల్ హీరో అని పిలుస్తుంటే.. ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక పెద్ద బాధ్యత తన భుజాలపు ఉన్నట్టుగా ఫీలవుతుంటాను అన్నారు.
ఇప్పుడు విలన్ రోల్స్ చేయమని ఎవరూ రావడం లేదు. వచ్చినా అలాంటి పాత్రలు నన్ను ఉత్సాహపరుస్తాయో లేదో కూడా తెలియదు. ప్రస్తుతానికి నేను చేస్తున్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పారు. గత సంవత్సరం చాలా చాలా స్పెషల్. చాలా మంది వ్యక్తులతో కనెక్ట్ అయ్యాను. ఎంప్లాయిమెంట్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్.. కి సంబంధించి అవసరం ఉన్న వాళ్లకి సహాయం చేశాను. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాలి అనుకుంటున్నాను. ప్రజలకు మరింతగా ఉపయోగపడేలా సింగిల్ ఫ్లాట్ ఫామ్ తో కామన్ మేన్ కూడా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. వాళ్ల కలలు నిజం చేసేందుకు ప్రయత్నిస్తాను. ప్రజల జీవితాలను మార్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని వాగ్ధానం చేస్తున్నాను అంటూ సోనుసూద్ చెప్పారు.
Must Read ;- అమితాబ్ కి తాను రాసిన బుక్ అందచేసిన సోనూసూద్..!