జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల ప్రచారం గ్రేటర్‌లో జోరుగా సాగుతుంది. పదునైన మాటలు, వివాదాస్పద ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారంలో వేడిని రగుల్చుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇళ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చాలనుకుంటుందని ఆయన ఆరోపించారు. 4700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈ రోజు 700 ఎకరాలకు కుదించుకుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్ చుట్టుపక్కల ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోందన్నారు. హుస్సేన్ సాగర్ కట్టపై ఎన్టీఆర్, పీవీ సమాధులను కూడా కూల్చాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో తమకు బాగా తెలుసునని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజలను మాయమాటలతో మోసం చేస్తుందని అన్నారు.
బండి సంజయ్‌కు కౌంటర్…
అక్బరుద్ధీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను ఓవైసీ కూల్చేస్తాడట.. దమ్ముంటే కూల్చేయాలని కౌంటరిచ్చారు. నీ దారుసలేం భవనాన్ని క్షణాల్లో తమ కార్యకర్తలు కూల్చేస్తారని సంజయ్ ఆరోపించారు. బీజేపీ ఢిల్లీ పార్టీ అని ఓ నేత అంటున్నాడని, మీది గల్లీ పార్టీ అని పేర్కొన్నారు. మీది లోకల్ పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పోవాలని, టీఆర్ఎస్ పోవాలంటే బీజేపీ రావాలన్నారు. ఇండియా-పాకీస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ గెలవాలని అన్నోళ్లను తరిమికొట్టాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతలను చూసి ప్రభుత్వాన్ని ఎంఐఎం నేతలు పడగొడతామంటున్నారు, వాళ్ల బలమెంత అని ఎంఐఎంను మంత్రి తలసాని ప్రశ్నించారు. అసెంబ్లీలో వాళ్ల బలమెంతో అందరికీ తెలియదా అని ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు దేశమంతా తిరుగుతూ ఏ పార్టీకి మేలు చేస్తున్నారో తెలియదా? అని ఎంఐఎంకు కౌంటరిచ్చారు. టూరిస్టుల్లాగా హైదరాబాద్‌కు వచ్చి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్ తమ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. 40 వేల మంది రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్లు పాతబస్తీలో ఉంటే సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏం చేస్తుందని బీజేపీకి తలసాని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మాకు మించిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు.
Must Read ;- గుజరాత్ గులాములా? హైదరాబాద్ గులాబీలా?











