జీహెచ్ఎంసీ ఎన్నికలు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. విమర్శల స్థాయి కూడా తారాస్థాయికి చేరుకుంది. గ్రేటర్ ఎన్నికలకు పాతబస్తీ ప్రచార అస్త్రంగా మారింది. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారంటూ, రోహింగ్యాలు లేని ఎన్నికలు జరపాలని నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. తాజాగా బండి సంజయ్ మరో సారి ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాల ఓట్లతో మజ్లీస్, టీఆర్ఎస్ పార్టీలు గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వాళ్లు ఓట్లు వేస్తే గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. భారతీయుల ఓట్లతో గెలవలేరా అని వారిని ప్రశ్నించారు. రోహింగ్యాలు లేని ఎన్నికలకను భారతీయ జనతాపార్టీ కోరుకుంటుందని సంజయ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ వాళ్లని, రోహింగ్యాలను తరిమికొట్టాలా లేదా అని ప్రశ్నించారు. 12 శాతం ఓట్లు ఉన్న మైనారిటీల కోసం పనిచేస్తున్న నీ పార్టీ సెక్కులర్ పార్టీ అయితే, 80 శాతం హిందువుల కోసం పనిచేస్తున్న బీజేపీ మతతత్వ పార్టీనా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
మంగళవారం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిని ఉద్ధేశించి బండి సంజయ్ మాట్లాడారు. రోహింగ్యాలను ఇక్కడి నుండి తరిమేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని అడుగుతున్నా కేటీఆర్ సార్ అని ప్రశ్నించారు. 24 గంటల్లో పాకిస్తాన్ వాళ్లని చూపెట్టండని ఓవైసీ సవాల్ విసిరారని, ఈ సవాల్‌ను సీఎం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. హిందూస్తాన్ అనని అన్న బీహార్ ఎమ్మెల్యేని లోపలేసి బాదితే హైదరాబాద్‌లో బంగ్లాదేశీయులు ఎక్కడెక్కడ ఉన్నారో చెబుతారని సంజయ్ తెలిపారు. ఇలా నేతల మధ్య మాటల యుద్దం గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతోంది. పోలింగ్‌కు ఇంకా ఆరు రోజులు సమయం ఉంది. నేతల విమర్శలు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలి మరి.
Must Read ;- బీజేపీ శిబిరంపై బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్











