బాలీవుడ్ తారలు చాలామంది ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ వీరి కోసం తలుపులు తెరిచింది. దాంతో డిజిటల్ అరంగేట్రానికి వీరు ఎక్కుగా మొగ్గుచూపుతున్నారు. సీనియర్ల పని ఇక అయిపోయినట్లే అనుకున్న వారి నోళ్లు మూతపడబోతున్నాయి. అందరి దృష్టీ ఇప్పుడు ఈ విషయంలో ఐశ్వర్యారాయ్ పైనే ఉంది. ఓ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ వెబ్ సిరీస్ కోసం నెట్ ఫ్లిక్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఓటీటీకి ప్రాధాన్యం పెరిగింది.
అసలు ఓటీటీ కోసం ప్రత్యేకంగా ఇలా చేయవచ్చన్న ఆలోచన సీనియర్ల నటులకు ఈ ఏడాదే వచ్చిందని అనుకోవాలి. దాంతో డిజిటల్ అరంగేట్రం వైపు వీరంతా మొగ్గుతున్నారు. మొత్తానికి 2021లో చాలామందిని ఇలా ఓటీటీలో మనం చూడవచ్చన్న మాట. ఇప్పటికే సుస్మితాసేన్, బాబీడియోల్ లాంటి వారు రంగంలోకి దిగిపోయారు. ఇక నేడో రేపో ఐశ్వర్యారాయ్ కూడా బరిలోకి దిగనుంది. ఇంతకుముందు సినిమాల్లో లాగా స్టీరియో టైపు పాత్రలు కాకుండా తమ కంటూ ఓ బ్రాండ్ సంపాదించుకునే ప్రయత్నాల్లో వారున్నారు.
ఐశ్వర్యారాయ్ విషయంలో ఇప్పటిదాకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. నెట్ ఫ్లిక్స్ ప్రయత్నిస్తోంది కాబట్టి ఇది కార్యరూపం దాలుస్తుందని అనుకోవచ్చు. ఇప్పటికే చాలామంది నటులు ఓటీటీలో ఇమిడిపోయారు. సైఫ్ అలీఖాన్, పంకజ్ త్రిపాఠి, మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటులు ఇప్పటికే తామేంటో ఇందులో చూపిస్తున్నారు. ఓటీటీ కంటెంట్ కు పెద్ద నటుల కటౌట్ కూడా తోడైతే వీటికి కూడా క్రేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఐశ్వర్య నుంచి అధికారిక ప్రకటన వస్తే మరికొంతమంది కూడా వరుసగా వీటి కోసం క్యూకడతారనడంలో ఆశ్చర్యం లేదు.
Must Read ;- విక్రమ్ భట్ ‘అనామిక’ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్