సినిమాలకు అవార్డులు ఇచ్చే విషయంలో ఫిలింపేర్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. దాదాపు ప్రభుత్వ అవార్డులకు ఉన్న విలువ ఎలాంటిదో అలాంటి ఇమేజ్ ఫిలిం ఫేర్ కు ఉంది. అయితే ఫిలిం ఫేర్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా దీనికి కరోనాయే కారణం. థియేటర్లలో సినిమాలు విడుదల కావడం లేదు. కేవలం ఓటీటీ వేదికలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో అవార్డులు ఇవ్వాలంటే ఓ ప్రత్యేక కేటగిరీ ఉండాల్సిందే. అందుకే ఫ్లెక్స్ ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డులు పేరుతో కొత్తగా అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి ఫిలిం ఫేర్ శ్రీకారం చుట్టింది. ఓటీటీ లాంటి డిజిటల్ మాధ్యమాలు ప్రధాన మాధ్యమాలకు గట్టి పోటీని ఇస్తున్నాయి. వీటిలో వచ్చే కంటెంట్ లో ప్రతిభా వంతులకు అవార్డులు ఇవ్వాలని ఫిలిం ఫేర్ నిర్ణయించింది.
23 నుంచి ఓటింగ్ ప్రక్రియ
ఫ్లెక్స్ ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డులకు ఓటింగ్ ప్రక్రియను ఫిలిం ఫేర్ సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా అవకాశం కల్సిస్తోంది. ఈ నెల 23 వ తేదీ నుంచి ఈ అవార్డులకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఈ సంస్థ వరల్డ్ వైడ్ మీడియా సీఈఓ దీపక్ లాంబా ప్రకటించారు. భవిష్యత్తులో ఓటీటీ కంటెంట్ ను చూసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఈ సంస్థ ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటికిదాకా సినిమాలకు అవార్డులు ఇస్తూ వస్తున్న ఈ సంస్థ వెబ్ సిరీస్ కు అవార్డులు ఇచ్చే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ వెబ్ సిరీస్ లో నటించే అనేకమంది కళాకారులకు గుర్తింపు ఇవ్వాలన్నదే తమ ఉద్ధేశమని ఈ సంస్థ అంటోంది.
టైమ్స్ గ్రూప్ ఈ అవార్డులను ఏర్పాటు చేసింది. ఇప్పటిదాకా 64 సార్లు ఈ అవార్డులు ప్రకటించింది. ఎక్కువగా ముంబయిలోనే ఈ అవార్డులు జరుగుతుంటాయి. ప్రతిభావంతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ అవార్డులను ప్రవేశపెట్టామని ఫిల్మ్ ఫేర్ ఎడిటర్ జితేష్ పిళ్లై అన్నారు. అందులో భాగంగానే ఓటీటీకి ఈ అవార్డులను విస్తరించామని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు రావాల్సిందేనన్న అభిప్రాయంతో ఈ సంస్థ ఉంది. ఆధునిక యుగంలో డిజిటల్ వినోదానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడినందున ఈ అవార్డులు ప్రవేశపెట్టారు. అయితే ఈ అావార్డులు కేవలం వెబ్ సిరీస్ కు మాత్రమే పరిమితమవుతారా? లఘు చిత్రాలకు కూడా అవార్డులు ఇస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ నెల 23 న ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Must Read ;- గోదావరి ప్రేమికుడి చూపు.. వెబ్ సిరీస్ వైపు











