భారత క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్ల మధ్య ప్రేమాయణం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అప్పట్లో క్రికెటర్లు పటౌడి, మహ్మద్ అజహరుద్దీన్, గంగూలీ బాలీవుడ్ ముద్దుగుమ్మలతో చెట్టాపట్టాలేసుకుని వార్తల్లోకి ఎక్కారు. వారి బాటలోనే నడిచిన హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇటీవల ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా బాలీవుడ్ నటి నటాశాతో జతకలిసేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంకా అతియా శెట్టితో డేటింగ్‌లో ఉన్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది.
భారత్ లో క్రికెట్ కు, సినిమాను అవినాభావ సంబంధం ఉంది. కొందరు ప్రేమతో అలరిస్తే.. మరికొందరు ఆ బంధాలను పెళ్లి వరకూ తీసుకెళ్లారు. ఇప్పుడు భారత క్రికెట్ ఓపెనర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి జంట నిత్యం వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అతియా శెట్టి.. ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ముద్దుల కూతురు. అంతేకాదు కేఎల్ రాహుల్,అతియా శెట్టి.. త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారని బాలీవుడ్ కోడై కూస్తోంది.
Must Read ;- సన్నీ సిక్సర్.. ఇంగ్లాండ్తో సిరీస్ లో హాట్ బ్యూటీ!
నెట్టింట్లో ఆ ఫొటోలు..
కేఎల్ రాహుల్, అతియా శెట్టికి మధ్య ఏదో నడుస్తుందంటూ ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు వెళతారంటూ ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే చాలాసార్లు జాలీ ట్రిప్స్ వేశారని రూమర్లు వినిపించాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ వీరిద్దరూ ఎప్పుడూ నోరు విప్పలేదు.
ఆ పార్టీలో లవ్ బర్డ్స్ హల్ చల్…











