రియల్ హీరోతో సినిమా హీరోలు సాహస యాత్ర చేస్తే ఎలా ఉంటుంది? ఈ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వంతు వచ్చింది. సాహస యాత్రికుడు బేర్ గ్రిల్ తో కలిసి అక్షయ్ సాహస యాత్ర చేస్తున్నాడు. ఇంతకుముందు నరేంద్ర మోడీ, రజనీకాంత్ బేర్ గ్రిల్ తో ఈ సహస కార్యంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఇటీవల అతడితో కలిసి చిత్రీకరించిన సన్నివేశాల టీజర్ ను విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజా గా మరో టీజర్ విడుదలైంది. తనను బాలీవుడ్ యాక్షన్ హీరో అని బేర్ గ్రిల్ పరిచయం చేయగానే అక్షయ్ ‘నేను రీల్ హీరో… అతను రియల్ హీరో ’ అంటూ కితాబిచ్చాడు. ఈ సాహసయాత్ర ఎపిసోడ్ డిస్కవరీ ప్లస్ యాప్ లో సెప్టెంబరు 11న విడుదల కానుంది. చూద్దాం వీరి సాహస యాత్ర ఎలా జరిగిందో.
I visualized stiff challenges prior to #IntoTheWildWithBearGrylls but @bearGrylls completely surprised me with the elephant poop tea 💩 What a day 🐊😂 @DiscoveryIn @DiscoveryPlusIn pic.twitter.com/m6YfQXmCcM
— Akshay Kumar (@akshaykumar) August 31, 2020