స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి జన్మదిన వేడుకలు షూటింగ్ స్పాట్ లో నిర్వహించారు. శనివారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అల వైకుంఠపురంలో… దోస స్టెప్.. తన చిట్టి చేతులతో వేసి సోషల్ మీడియా లో వైరల్ అయింది అల్లు అర్జున్ కూతురు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మన్యంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్.. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలో పాల్గొన్నారు.
మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్స్ లో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. 15 రోజులుగా మారేడుమిల్లి మన్యంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా.. పుట్టినరోజు వేడుకలను అక్కడే చిత్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లు అర్జున్ ట్విట్టర్లో ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోగా.. ఇప్పుడు అందరికీ తెలిసింది. అలాగే.. అర్హ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆమెకు ఓ అపురూపమైన కానుకను అందజేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. అర్హకు నాలుగేళ్లు నిండి ఐదో ఏట అడుగుపెట్టింది.
Must Read ;- సినీ ప్రముఖలతో అల్లు అర్జున్ ‘ఆహా’ ఏమిటో?











