స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా అది న్యూస్ అవుతోంది. మీడియాలో హెడ్ లైన్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి నుంచి షూటింగ్ లకు బ్రేక్ పడడంతో అభిమానులు బన్నీకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కుదిరితే ఒక్కసారిని బన్నీని కలవాలని వెయిట్ చేస్తున్నారు. అయితే.. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.

ఈ సినిమా ఇటీవల రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరిగింది. ఆతర్వాత కరోనా కారణంగా షూటింగ్ ఆపేయడం.. హైదరాబాద్ లో రీసెంట్ గా స్టార్ట్ చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల అల్లు అర్జున్ సమంత చేస్తున్న సామ్ జామ్ టాక్ షాలో పాల్గొన్నారు. ఇందులో బన్నీ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తండ్రి అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి..? అని సమంత బన్నీని అడిగితే.. చాలా ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఇంతకీ అది ఏంటంటే.. ఇంట్లో బూతులు మాట్లాడడం తగ్గించేశానని చెప్పాడు.
సమంత.. బన్నీ ఇంకా ఏదో చెబుతాడు అనుకుంటే.. బూతులు తగ్గించానని చెప్పి.. అక్కడ ఉన్న వారందర్నీ సర్ ఫ్రైజ్ చేశాడని చెప్పచ్చు. ఈ షోలో బన్నీతో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ టాక్ షోకు సంబంధించిన ప్రొమోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టాక్ షో ఫుల్ ఎపిసోడ్ ను న్యూయర్ గిఫ్ట్ లా ఆహాలో జనవరి 1న ప్రసారం చేయనున్నారు.
Must Read ;- బన్నీ గురించి వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!











