భవ్య రాజధాని భావితరాల కోసమే!
భవ్య రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటే .. ఏపీ నడిబొడ్డు నుంచి పాలన అద్భుతంగా ఉంటుందని భావించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాజధానిని అమరావతిని నిర్మించ తలపెట్టారు. ‘ప్రజా రాజధాని అమరావతే ఆంధ్రుల శాశ్వత రాజధాని. అది ఎప్పుడో దైవ సంకల్పంతో నిర్ణయించబడింది. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా రాజధాని అంశాన్ని మార్చుకుంటూ పోతే ..! చివరికి ఆ ఆలోచనలు చేస్తున్న నాయకున్నే ప్రజలు మార్చేస్తారన్న చిన్న లాజిక్ ను అధికారపార్టీ మర్చింది కాబోలు!!’ అందుకే ఉవ్వెత్తున ఎగిసిపడే అనేక ప్రజా ఉద్యమాలను నేడు రాష్ట్రంలో చూస్తున్నాం. అందులో ఒకటిగా ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పాదయాత్ర. ఇదే యాత్రే .. రైతుల తలరాతలను మారుస్తోందని, అందుకు ఆ గోవిందుడే దారి చూపుతాడని నమ్మి .. వందల కీలోమీటర్ల పాదయాత్రకు సంకల్పించారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ.. పూల తివాచిలను పరిచి, మంగళహారతలను పడుతున్న దృశ్యాలు రైతు సాహస యాత్రకు నూతన ఉత్సహాన్ని నింపుతోంది.
మార్చాలని చూస్తే .. మడతడిపొయిందిగా ..!
అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరోక మాట అంటే కుదరదు జగన్ రెడ్డి .. అమరావతి రాజధాని శాశ్వతంగా దైవ సంకల్పంతో పునాదులు వేసుకున్న ప్రజా రాజధాని అని పాదయాత్రలో రైతులు నినదిస్తున్నారు. రెండేళ్ల క్రితం అధికార పార్టీ పన్నిన కుట్రల ఫలితం తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వవొచ్చునేమో కానీ … ప్రకృతిని వికృతి చేస్తానంటే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోవాల్సింది. జగన్ రెడ్డి కావలించుకున్న మూడు ముక్కాలాట వంటి అనాలోచిత చర్య నేడు ఆ పార్టీని పతాక స్థాయిలో పతనం అంచుకు చేర్చింది. కేవలం తుళ్లూరు కే ఉద్యమాన్ని పరిమితం చేశామని సంబరపడిపోయిన జగన్ .. ఆ ఉద్యమ వేడి నివురుగప్పిన నిప్పులా ఉందని గమనించలేకపోయాడు. అందుకు ఉదాహరణే పాదయాత్రకు అడుగడుగు నిరాజనాలు, కులాలకు,మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా లభిస్తున్న మద్దుతు. డిసెంబర్ 17, 2019.. ఈ తేదీనే రాజధాని రైతులు చీకటి రోజుగా పరిగణిస్తారు. నాటి నుంచి నేటి వరకు జగన్ మూడు రాజధానుల ప్రకటన ద్వారా రాజకీయంగా సాధించిందేమి లేదు. నేటికీ అమరావతి నుంచి ఒక్క ఇటుక కూడా కదల్చలేకపోయాడు. ఆయన ప్రకటించిన రాజధానుల్లో ఒక్క బొచ్చ సిమెంట్ కూడా నేటికీ వేయలేకపోయాడు. అంతిమంగా చెప్పలంటే భూములిచ్చిన రైతులే వెంకటేశ్వరస్వామి దయతో రాజధానిని డివోషనల్ సెంట్మెంట్ తో సాధించకోబోతున్నరన్నది సత్యం.
15 వ రోజు పాదయాత్ర పదనిసలు..
రాజధాని అమరావతి రైతులు తలిపెట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జన నీరాజనాల నడుమ సాగుతోంది. పల్లెలను చుడుతూ .. పట్టణాలను, నగరాలను టచ్ చేస్తూ మద్దతుగా వస్తున్న అన్ని ప్రాంతాల రైతులను కలుపుకుంటూ మందుకు పురోగిమిస్తోంది. పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతుల నేడు రోడ్డుపై నడుస్తూ .. అంది కాడ కాస్తా ఆగి కడుపు నింపుకుంటూ .. అలుపెరగక నడుస్తు ముందు సాగుతున్న దృశ్యం కడుదయనీయం. కనువిప్పు, కనికరంలేని ప్రభుత్వం.. పోలీసు అంక్షాలతో బెదిరిస్తూ లాఠీలను జులిపిస్తున్నారు. అయిన రైతులు గోవిందుడు సన్నిధానానికి తమ గోడు విన్నవించుకోవడానికి శక్తినంతా కూడగట్టుకుంటున్నాడు. దారిపొడుగునా పెద్దఎత్తున నీరాజనాలు, మద్దతలు, సంఘీభావాలు వారికి అదనపు శక్తినిస్తున్నాయి. ముందుచూపుతో పాదయాత్రలో సమన్వయ విభాగాలు చేస్తున్న సహాయ సహకారాలు ప్రశంసనీయం. ఇది రాజకీయ పోరాటం కాదు .. అమరావతిని కాపాడుకునే ఆరాటం అని రైతులు 15వ రోజు ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి మండలం మొదలై 14 కీలీమీటర్ల నడిచి కందుకూరు మండలం విక్కిరాలపేటలో రాత్రికి విరాయం తీసుకోనున్నది.
Must Read ;- దాడులతో దండయాత్ర ఆగదు .. అక్కసుతోనే లాఠీచార్జి!











