వైసీపీ ప్రభుత్వంలో దళితులకు స్థానంలేదన్న వాస్తవం!
వైసీపీ ప్రభుత్వంలో దళితలకు స్థానం లేదు అన్నది అక్షర సత్యం. ఆ సత్యాన్ని బహుజనులు, దళిత సంఘాలు ఎప్పుడో గుర్తించాయి. ఉత్తరాంధ్రాను మొదలుకొని రాయలసీమ వరకు నిత్యం దళితలపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల అనేవి లెక్కకుమించినవి. ఇంత వివక్ష ఎందుకో అర్థకాదుకానీ .. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటివరకు కూడా ఇంతలా దేశ వ్యాప్తంగా ఇటువంటి దాడులు ఏపీలో తప్ప ఎక్కడ చోటు చేసుకోకపోవడం గమనార్హం. దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన జగన్ కు ఈ దాడుల లెక్క పట్టదా అని దళిత మేథావులు ప్రశ్నిస్తున్నా .. దున్నపోతుమీద వాన చందమే. ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై అధికార పార్టీకి చెందిన దళిత నాయకులతో అసభ్య పదజాలంతో విరుకుపడేలా పురికొల్పుతున్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటే చాలు వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడటం, ఒప్పుకొకుంటే దాడులు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వంలో పరిపాటిగా మారింది. ఇందుకు ఉదాహరణే ఏపిలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు జరగుతున్న ఎన్నికలే. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వెంకటేశ్ అనే దళితుడిపై 30 వైసీపీ కార్యకర్తలు ముకుంబడి చేసిన దాడి, గుంటూరు జిల్లా గురజాల మున్సిపల్ ఎన్నికలలో మైనారిటీ మహిళా సుందగిరి నజీమూన్ నామినేషన్ చింపి, ఆమెపై దాడి, తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కాచవరం పంచాయితీ ఒకటో వార్డుకు నామినేషన్ వేసిన గిరిజన మహిళ శిరీష కు బెదింపులు వంటివి వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్న దమనకాండకు నిర్శనాలు కావా అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతిమంగా ప్రజాస్వామ్య పద్దతిలో పదవులకు పోటీ చేసే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దళితులకు లేదు అన్నది జరుగుతున్న ఘనటలకు సజీవ సాక్ష్యాలు.
దళితుల సంక్షేమం మరిచారు .. దాడులే లక్ష్యంగా పెట్టుకున్నారు!
ఉత్తరాంధ్రాల్లో దళితులు .. బెదిరింపులు, దాడులు, శిరోముండనాలను చూస్తే .. రాయలసీమలో రక్తాలు కారేలా హింసిస్తున్నారు. వివక్షలు, చిన్నచూపు వంటివి పరిస్థితులను తరుచూ అక్కడ దళితులు ఎదుర్కొంటున్నారు. దాడులు, శిరోముండనాలు, ఎన్నికల్లో పోటీచేస్తే చంపేస్తాం అన్న అనాగరిక చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి దళితలపై సాగిస్తున్న నరమేథం, ఊచకోతలు అన్నీఇన్నీకావు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో వైకాపా చేస్తున్న పాపాలు అన్నీఇన్నీకావు. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేష్ పై దాడి, నామినేషన్ పత్రాలు చించివేయడం వంటివి చూస్తే అక్కడి మున్సిపల్ ఎన్నికలు సాధరణ ఎన్నికలు తలపించేంతగా అధికార పార్టీ సృష్టించే సీన్ సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే కుప్పంలో అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలపై మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. వెంకటేశ్ ను 30 మందికి దాడికి దిగారని, ఆ దాడికి సంబంధించి ఫోటోలను కూడా లేఖకు జతచేశారు. గడిచిన 30 నెలలో వైసీపీ ప్రభుత్వం చేతిలో చితికిన దళితుల గురించి వివరించాలంటే ఒక గ్రంథం రాయాలి. రెండు శిరోముండనాలతో దళితులపై దాడులు సెంచరీ దాటాయి. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కిందా టీడీపీ హయంలో 2018 నుంచి 2020 వరకు రూ.24 వేల కోట్లును ఖర్చు చేస్తే .. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30 నెలల్లో కేవలం రూ. 5 వేల కోట్లు కూడా ఖర్చు చేయకా .. ఆ నిధులను ఫిచన్లు, అమ్మఒడి, రైతు భరోసా పథకాలకు మరలించడం కడు విచారం. ఇదేక్కడి దౌర్భగ్యమోకానీ.. టీడీపీ హయంలో దళితలకు భూమి కొనుగోలు పథకం కింద 5 వేల ఎకరాలు పంపిణీ చేస్తే .. ఏపి ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో 4 వేల ఎకరాల అసైన్ట్ భూములను లాక్కొంది.
Must Read ;- కొనసాగుతున్న ధ్వంస రచన : దేశం నేతల ఆస్తులపై దాడులు!