మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒకరు అన్నయ్య.. ఇంకొకరు తమ్ముడు. ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి తెర పై కనిపిస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఈ క్రేజీ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఇప్పుడు మళ్లీ చిరు, పవన్ కలిసి నటించడం అనేది వార్తల్లో నిలిచింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. చిరంజీవి 154వ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. దీనికి బాబీ దర్శకుడు. ఇందులో చిరంజీవి పక్కా మాస్ పాత్రను పోషిస్తున్నారు. వైజాగ్ హార్బర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమాకి వాల్తేరు శీను అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్ర ఉందట. ఆ పాత్రను రవితేజతో చేయిస్తారని గతంలో వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేయించాలని బాబీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. దానికి చిరు సొంత తమ్ముడు పవన్ అయితే.. ఇంకా బలంగా ఉంటుందని బాబీ ఆయన్ను సంప్రదించారని సమాచారం.
అయితే.. పవన్ ఇప్పుడు ఓ వైపు రాజకీయాల్లో మరో వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీలో ఈ సినిమాకి టైమ్ ఇస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. వెంకీ మామ మూవీతో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేష్, నాగచైతన్యను ఒక స్ర్కీన్ పై ఆవిష్కరించి అభిమానుల్ని అలరించారు బాబీ. ఈ తరహాలోనే ఇప్పుడు మెగాస్టార్ , పవర్ స్టార్ లను ఒకే తెర పై చూపించాలి అనుకుంటున్నాడు బాబీ. అంతా అనుకున్నట్టుగా జరిగి ఇదే కనుక నిజమైతే… ఈ సినిమా మెగా అభిమానులకు నిజమైన పండగ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Must Read ;- భీమ్లా నాయక్.. ఆల్ టైమ్ రికార్డ్











