గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయాయి. బీజేపీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఎన్నికలకు మరింత ప్రయారిటీ పెరిగింది. ఈ సారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దక్షిణ భారతంలో కర్ణాటక తరువాత మరే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు వారికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వలేదు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక తరువాత బీజేపీకి ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ పెరిగింది. వెంటనే వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. షెడ్యూల్ రాక ముందు నుండే ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించి అధికార టీఆర్ఎస్ కంటే ముందే ప్రజల వద్దకు వెళ్ళింది.
Also Read:-హైదరాబాద్ మంత్రులకు గ్రేటర్ పరీక్ష
మాటకు మాటతో సమాధానం
గ్రేటర్ షెడ్యూల్ వెలువడిన తరువాత బీజేపీ క్షేత్ర స్థాయిలో దూకుడు మరింత పెంచింది. రాష్ట్ర నాయకత్వం అధికార టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటూ దూసుకు పోతోంది. మాటకు మాటతో సమాధానం చెబుతున్నారు. వీరికి తోడు జాతీయ నాయకత్వం సైతం ఈ ఎన్నికలపై గతంలో ఎన్నడూ లేని విధంగా దృష్టి పెట్టింది. స్టార్ క్యాంపేయినర్‌లుగా రాష్ట్ర నాయకులనే ఉంచినా జాతీయ నాయకులు ఒక్కొక్కరు గ్రేటర్ నగరం బాట పడుతున్నారు. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యాదర్శి భూపేంధర్ యాదవ్ టీం క్షేత్రస్థాయిలో గ్రేటర్‌లో పరిస్థితిని చక్కబెడుతున్నారు. ఈ టీంలో ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు కూడా ఉన్నారు. వారంతా పెద్దగా బయటకు ఫోకస్ కాకుండానే తమ బాధ్యతలను నెరవేస్తున్నారు.
Also Read:-ఎక్కడా కాంప్రమైజ్ కాని బీజేపీ ..
రంగంలోకి జాతీయ నేతలు
ఇక నేడు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య నగరంలో అడుగు పెట్టారు. వచ్చి రావడంతోనే టీఆర్ఎస్, ఎంఐఎంలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. టీఆర్ఎస్‌కు ఓటేసినా .. ఎంఐఎంకు ఓటేసినా అరాచకాలకు అండగా నిలిచినట్టే అంటూ హీట్ పెంచారు. గ్రేటర్‌లో వీరి అరాచకాలు అడ్డుకుంటే తప్ప మరో జిన్నా నుండి దేశాన్ని కాపాడుకోలేమంటూ తన సందేశాన్ని స్పష్టంగా ప్రజలకు వినిపించారు. ఇక రానున్న రోజుల్లో మరింత మంది జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు కూడా నగరంలో పర్యటించనున్నారు. దేవేంధ్ర ఫడ్నవీస్, స్మృతి ఇరాని, ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్, బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్‌తో పాటు ఉత్తర భారతంలో వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కూడా నగరానికి రాబోతున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో గ్రేటర్ ప్రచారంలో మరింత హీట్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్ ఎలా కౌంటర్ ఇస్తుంది.. మేయర్ పీఠం ఎలా నిబెట్టుకుంటుందో చూడాలి.
Also Read:-బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదురుతోంది!