గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. తాను అనుకున్న లక్ష్యం చేరేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తమ ఆలోచనలకు పదును పెడుతున్న ఆ పార్టీ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుండటంతో ఈ సారి గ్రేటర్ మేయర్ పీఠంపై గురి పెట్టింది. వంద సీట్లు వస్తే గాని మేయర్ పీఠం దక్కదని తెలిసినా తన ప్రయత్నం తాను చేస్తోంది. గత ఎన్నికల్లో వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఈ సారి బీజేపీ నేతలు , కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో మంచి ఊపు తీసుకు వస్తోంది. ఎలాంటి ప్రచార ఖర్చు లేకుండానే బీజేపీ దూకుడుకు మీడియాలో గంటల తరబడి స్పేస్ ఇస్తున్నాయి
Must Read:-హైదరాబాద్ మంత్రులకు & గ్రేటర్ పరీక్ష
హిందుత్వం ఎజెండాగా ముందుకు..
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్న వెంటనే హిందుత్వ ఎజెండా తెలంగాణలో తెరపైకి వచ్చింది. అప్పటి వరకు పార్టీ నేతల్లో పెద్దగా కదలిక లేదు. ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా పది ఇరవై కంటే ఎక్కువ మంది వచ్చేవారు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బండి సంజయ్ ఇచ్చిన పిలుపునకు వందలాది మంది తరలి వస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ముఖ్యనాయకులంతా కలిసి కట్టుగా మీడియా ముందుకు వచ్చిన తమ గళం విప్పుతున్నారు. ఇక గత కొద్దిరోజులుగా తమ బేసిక్ సిద్ధాంతమైన హిందుత్వం అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకు రాలేదు. బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్న తరువాత ప్రతి అంశాన్ని హిందుత్వానికి ముడిపెడుతూ మాటల తూటాలు పేలుస్తున్నారు. దీంతో మెజారిటీ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీతో పాటు అంతర్గతంగా కూడా ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గడం లేదు. ఈ ఎన్నికల్లో కూడా ఇదే అంశంతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఎంఐఎంతో పాటు టీఆర్ఎస్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
గ్రేటర్ బరిలో ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా బండి తన మార్క్ చాటుకున్నారు. మొదటి లిస్ట్‌లో మొత్తం ఓల్డ్ సిటీలోని డివిజన్‌లలో పోటీ చేసే అభ్యర్థులనే ప్రకటించారు. అందులో ఒక్క ముస్లిం అభ్యర్థి పేరు లేకుండా అందరినీ ఆశ్చర్య పరిచారు. తరువాత లిస్ట్‌లో అయినా వారికి స్థానం ఉంటుందని భావించినా కేవలం ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థికి టికెట్ కేటాయించి తన మార్క్ చాటుకున్నారు. అంతే కాకుండా గెలుపు గుర్రాల వేటలోనూ ఆయన మరింత స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకున్నారు. తనకు తగ్గట్టుగా స్పీడ్‌గా ఉండే వారికే జాబితాల్లో పెద్దపీట వేశారు. గ్రేటర్ ఎన్నికలంటే ముస్లిం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటాయి. అందుకే మజ్లీస్ పార్టీతో పొత్తులు పెట్టుకుని అధికార పార్టీలు ఈ ఎన్నికలకు వెళ్తుంటాయి. కాని సంజయ్ మొదటి సారి ఆ రాజకీయాలకు చెక్ చెబుతూ కేవలం హిందువులనే గ్రేటర్‌లోని అన్ని డివిజన్లకు ప్రకటించారు. సంజయ్ ప్లాన్ ఏమేరకు వర్కౌట్ అవుతుందో… ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారో.. లేదో చూడాలి.
Also Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!