గ్రేటర్ ఎన్నికల్లో చాలా పెద్ద ఫేవర్ చేశాడు గనుక.. దానికి రిటర్న్ గిఫ్్టగా తిరుపతి ఎంపీ సీటు తీసుకోవాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని చాలా ప్రచారం జరిగింది. నిజానికి పవన్ కల్యాణ్ సినిమా షూటింగుకే వెళ్లారో.. రాజకీయ భేటీలకోసం వెళ్లారో కూడా క్లారిటీ లేదు. కాకపోతే.. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు గనుక అచ్చంగా.. రాజకీయ భేటీలకోసమే వెళ్లారని అంతా అనుకున్నారు. కానీ ఆయన బయల్దేరి వెళ్లిన తర్వాత.. ఢిల్లీలో ఒక షూటింగ్ షెడ్యూలు కూడా ఉన్నదని బయటకు వచ్చింది.
అయితే మంగళవారం నాడు.. పవన్ కల్యాణ్ ఢిల్లీలో బీజేపీ పెద్దలెవ్వరినీ కలవలేదు. ఆయనకు జెపి నడ్డా అపాయింట్మెంట్ లభించలేదని సమాచారం.అయితే ఆయన ఎవ్వరికీ అందుబాటులో కూడా లేరు. పూర్తిగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. షూటింగు షెడ్యూలు ఉన్నదా లేదా.. ఉంటే ఎక్కడ అనే వివరాలు కూడా తెలియలేదు.
ఒకవైపు పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే తిరుపతిలో బీజేపీ సీనియర్ నాయకులంతా ఎంపీ ఎన్నికల కోసం ఒక సన్నాహక సమావేశం పెట్టుకున్నారు. తిరుపతి ఎంపీసీటు తమ పార్టీకి కావాలని పవన్ ఢిల్లీలో మంతనాలు సాగిస్తారని వార్తలు వస్తున్న సమయంలోనే.. తిరుపతి సీటు మరొక పార్టీకి ఇచ్చే అవకాశమే లేదని తిరుపతిలో బీజేపీ నేతలు తెగేసి చెప్పేశారు. ఢిల్లీలో ఇవాళ పవన్ కు అపాయింట్మెంట్ దొరక్కపోవడానికి ఇది కూడా ఒక కారణం అయిఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది.
MusT Read ;- తిరుపతి బరిలో తొడకొట్టనున్న పవన్!











