టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైనర్స్, జీ.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం మహేష్ బాబు లేకుండానే జరిగింది. మహేష్ కూతురు సితార క్లాప్ కొత్తగా, మహేష్ భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలను దర్శకుడు పరుశురామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ ట్విట్ పై డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్పందించారు. ట్విటర్ ద్వారా దర్శకుడు పరుశురామ్ కు అభినందనలు తెలిపాడు పూరీ. ”సర్కారు వారి పాట’ సినిమాను మొదలపెట్టినందుకు నీకు అభినందనలు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్. నేను ముంబయిలో బిజీగా ఉండడం వలన పూజా కార్యక్రమానికి రాలేకపోయాను. నీ మీద నా ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సినిమా మహేష్ అభిమానులకు మంచి ట్రీట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని ట్విట్ చేశాడు పూరీ. అసలు పరుశురామ్ పూరీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు పనిచేశాడు. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.
పూరీ ట్విట్ పై మహేష్ అభిమానులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తమ అభిమాన హీరోతో మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారని పూరీని అడుగుతున్నారు అభిమానులు. మరి పూరీ మహేష్ అభిమానులకు ఎలాంటి రిప్లై ఇస్తాడో చూడాలి. పూరీ ఇప్పటికే ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ అనే రెండు సినిమాలను మహేష్ బాబుతో చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘పోకిరి’ సినిమా టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులను తిరగ రాసింది. ‘బిజినెస్ మెన్’ సినిమా తర్వాత పూరీ – మహేష్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు.
Must Read ;- మహేష్ గౌతమ్ లతో ఆమె ఉందంటే సీన్ ‘సితారే’
Congratulations @ParasuramPetla for ur most exciting venture #SarkaruVaariPaata
I am held up in mumbai and missed attending the Pooja ceremony today.
my love to u always.
all the best to the entire team, this is surely gonna be a big treat to all @urstrulyMahesh fans 💪🏽 https://t.co/iaDB5QRKKf— PURIJAGAN (@purijagan) November 21, 2020