రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్ ను లైన్ లో పెట్టుకొని .. ఇండియా వైడ్ గా ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. డార్లింగ్ ముందుగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసే పనిలో పూర్తి బిజీగా ఉన్నాడు. అందాల పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా పునర్జన్మల బ్యాక్ డ్రాప్ లో సాగే.. ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ గా చెబుతున్నారు. తమిళ సంగీత దర్శకుడు జెస్టిన్ ప్రభాకరన్ అందిస్తోన్న క్రేజీ ట్యూన్స్.. సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయంటున్నారు.
ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ యూనిట్ హైద్రాబాద్ లోని విలాసవంతమైన ఫలక్ నుమా ఫ్యాలెస్ లో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. ఈ నెలాఖరులోగా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయడమే థ్యేయంగా దర్శకుడున్నాడు. అంతేకాదు ఈ సినిమా టీజర్ ను వీలైనంత త్వరగా విడుదల చేసి ప్రభాస్ అభిమానుల్ని ఖుషీ చేయడం కూడా పనిగా పెట్టుకున్నాడాయన.
ఇటీవల ఓ ప్రైవేట్ స్టూడియో లో దాదాపు రూ. 30కోట్ల విలువ చేసే సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కొద్దిరోజులు సాగిన ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచిపోతాయని తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ టీజర్ గురించి దర్శకుడ్ని పదే పదే ప్రశ్నిస్తుండడంతో .. ఎట్టకేలకు దర్శకుడు స్పందించి.. త్వరలోనే టీజర్ తో మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తానని తెలిపాడు. తాజా సమాచారం ప్రకారం ‘రాధేశ్యామ్’ టీజర్ సంక్రాంతి కానుకగా.. విడుదల కానుందని తెలుస్తోంది. మరి ‘రాధేశ్యామ్’ టీజర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్ విలన్ గా జాన్ అబ్రహం.. ఏ సినిమా?