ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు ‘ఆదిపురుష్‘. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనోన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ‘ఆదిపురుష్’ సినిమా గురించి తెగ చర్చించుకుంటున్నారు. అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చి లో చిత్రం షూటింగ్ లోకి సైఫ్ అడుగుపెట్టబోతున్నాడు.
ప్రస్తుతం సైఫ్ తన హాలిడేను కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. భార్య కరీనా కపూర్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు. అందుకే ఆమెతోనే సైఫ్ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆదిపురుష్ సినిమా షూటింగ్ జనవరి 19వ తేదీన ముంబయిలో ఉన్న ఒక ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కానున్నది. కొందరు నటీనటులు జనవరిలోనే షూటింగ్ లో జాయిన్ అవుతారు. అయితే సైఫ్ మార్చి చివరి వారంలో షూటింగ్ లోకి అడుగుపెడతారు. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ ధృవీకరించారు.
జనవరి నుండి ఆగష్టు వరకు సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఇక ఈ సినిమా రామాయణ పాత్రల ఆధారంగా రూపొందనుంది . ఇందులో రాముని పాత్రలో ప్రభాస్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, ఇక సీతగా కృతి సనోన్ నటిస్తున్నారు. ఈ మధ్యనే సైఫ్ .. రావణుడి గురించి పాజటివ్ గా మాట్లాడి హిందువుల ఆగ్రహానికి కారణమయిన సంగతి తెలిసిందే. సీతను ఎత్తుకెళ్ళడం రావణుడి దృష్టిలో తప్పు కాదు అన్నట్లు ఆయన మాట్లాడారు. వెంటనే దీనిపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. సినిమా షూటింగ్ జరగకుండా చేస్తామని వార్నింగిచ్చారు. తన కామెంట్స్ పై వివరణ ఇచ్చి హిందూ సంఘాల వారికి క్షమాపణ చెప్పారు సైఫ్. అక్కడితో గొడవ సద్దుమణిగింది. ‘ఆదిపురుష్’ సినిమా సెట్స్ పైకి వెళ్తుండటంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Must Read ;- సంక్రాంతికి పోటీపడుతున్న పవన్, ప్రభాస్