పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 2013 నుంచి రెండు సంవత్సరాలకు ఒక సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. దీంతో ఎక్కువ సినిమాలు చేయాలి. ఇంత గ్యాప్ తీసుకోవద్దు అంటూ ప్రభాస్ పై అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. 2013లో మిర్చి సినిమా చేసాడు. ఆతర్వాత రెండు సంవత్సరాలకు అనగా 2015లో బాహుబలి 1 సినిమా రిలీజ్ చేసారు. ఆతర్వాత రెండు సంవత్సరాలకు అనగా 2017లో బాహుబలి 2 రిలీజ్ అయ్యింది. బాహుబలి 2 వచ్చిన రెండు సంవత్సరాలకు సాహో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ విధంగా ప్రభాస్ రెండు సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ చేస్తుండడంతో ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు.

అందుకనే.. అభిమానుల ఫీలింగ్ అర్ధం చేసుకున్న ప్రభాస్ స్పీడు పెంచాడు. పక్కా ప్లాన్ రెడీ చేసాడు. 2021లో రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా రాథేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంటే.. కీలక పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక జనవరి నుంచి సలార్ మూవీ స్టార్ట్ చేయనున్నారు. దీనికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. జనవరిలో స్టార్ట్ అయ్యే ఈ సినిమాని సమ్మర్ కి కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఈ యాక్షన్ మూవీని 2021లో దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ లెక్కన 2021లో ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేసాడు. అన్నీ అనుకున్నట్టు జరిగి 2021లో ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ చేస్తే.. అభిమానులకు పండగే పండగ.
Must Read ;- ప్రభాస్ ‘సలార్’ సరసన బాలీవుడ్ బ్యూటీ?











