జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు హైదరాబాద్‌లో రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేష్ల స్వీకరణ గడువు ముగిసిపోయింది. దీంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారం, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శుక్రవారం వరకు మొత్తం 2062 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇందులో 90 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ రోజు పోతేగానీ అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉండబోతున్నారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..
Also Read:-జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ.. ‘జగన్’ నినాదం!
బరిలోకి సంపన్నులు..
ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈ ఎన్నికల బరిలో నిలిచారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, అలాగే ఉన్నత చదువులు చదువుకున్న వారితోపాటు ఉన్నత ఆశయాలు కలిగి ఉన్న వారు కూడా పోటీలో నిలిచారు. కోట్లకు పడగలెత్తిన సంపన్న వర్గం కుటుంబాల నుంచి పోటీ చేస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే తమ పేరుపై ఎలాంటి ఆస్తులు లేని అభ్యర్థులు కూడా పోటీలో నిల్చున్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థుల్లో పీజేఆర్ కుమార్తే విజయారెడ్డి ఉన్నారు. రూ.23,84,92,000 ఆస్తులతో విజయారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అలాగే ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన పేరు మీద స్థిర, చరాస్తులు రూ. 6,73,70,161 ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తెలిపారు. తన భర్త కంటే కూడా ఆమె పేరు మీదనే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి. బొంతు రామ్మోహన్ పేరు మీద రూ.39,53,340 ఆస్తులు మాత్రమే ఉన్నాయి.
Also Read:-జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ?
చేతిలో చిల్లి గవ్వ లేని టీడీపీ అభ్యర్థి..
ఒక్కొక్కరి పేర్ల మీద రూ.కోట్ల ఆస్తులు ఉంటే టీడీపీకి చెందిన కార్పొరేటర్ అభ్యర్థి చేతిలో చిల్లి గవ్వ లేకుండానే పోటీలో నిలిచింది. రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రోజా తనపేరిట ఎలాంటి ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన బ్యాంకు ఖాతాలో ఎలాంటి ఆస్తులు లేవని అందులో తెలపడం గమనార్హం. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఇలా ఎన్నికల బరిలో నిలుస్తారా? అని ఆశ్చర్యం కలిగిస్తున్నారు. అలాగే ఎంటెక్‌లు, ఎంఎస్సీలు, బీ-ఎడ్‌లు, ఎంఏలు చదువుకున్నవారు సైతం ఈ ఎన్నికల పోటీలో తలపడుతున్నారు.
Also Read:-150 డివిజన్లు.. 1932 మంది అభ్యర్థులు