బాలీవుడ్ లో ఇప్పటికీ గ్రీకు వీరుడు.. అమ్మాయిల కలల రాకుమారుడు.. హ్యాండ్సమ్ హంక్ ఎవరంటే.. అందరూ హృతిక్ రోషన్ పేరే చెబుతారు. తొలి సినిమా నుంచి ఇప్పటివరకూ అతడి అందం, ఆకారం, నటన బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నాయి. జయాజయాలతో సంబంధం లేకుండా.. హృతిక్ స్టార్ డమ్ అక్కడ కంటిన్యూ అవుతోంది. అలాంటి ఈ హీరో ఇప్పుడు హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుండడం అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.
హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రూపం.. స్టైల్ అండ్ స్ర్కీన్ ప్రెజెన్స్ అతడి సొంతం కాబట్టి.. అతడికి హాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంలో ఎలాంటి సందేహమూ లేదు. త్వరలోనే హృతిక్ హాలీవుడ్ లో సినిమా చేయబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అమెరికాకు చెందిన జెర్ష్ ఏజెన్సీతో హృతిక్ కు ఒప్పందం కూడా పూర్తయిందట. ఈ ఏజెన్సీకి ఇండియన్ మేనేజర్ అమృత్ సేన్ ఈ విషయాన్ని ధ్రువ పరిచాడట.
హృతిక్ ను హాలీవుడ్ లో ఏ తరహా సినిమాతో పరిచయం చేయాలనే చర్చలు జరగుతున్నాయట. మిషన్ ఇంపాసిబుల్ తరహాలో ఒక స్పై థ్రిల్లర్ లో హృతిక్ నటించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా దీనికి సంబంధించిన హృతిక్ ఆడిషన్ కూడా పూర్తయిందట. త్వరలోనే తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో క్రిష్ 4 మొదలుపెట్టబోతున్నడు హృతిక్. ఈ సినిమా పూర్తయిన తర్వాత అతడి హాలీవుడ్ మూవీ మొదలవుతుందని సమాచారం. త్వరలోనే ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ జరగుతుందట. మరి హాలీవుడ్ ఆఫర్ హృతిక్ కు ఏ మేరకు అడ్వాంటేజ్ గా మారుతుందో చూడాలి.










