ఇండియన్ డిస్కో డాన్సర్ .. బాలీవుడ్ వెటరన్ హీరో మిథున్ చక్రవర్తి నటిస్తోన్న తాజా చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముస్సోరీ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ లో మిథున్ చక్రవర్తి హఠాత్తుగా కుప్పకూలారు. కడుపునొప్పికారణంగా ఆరోగ్యం క్షీణించి మిథున్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చిత్రీకరణను ఆపివేశారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ విషయాన్ని తెలియచేశారు.
మిథున్ పై పెద్ద యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తూండగా.. హఠాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందట. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఆయన కళ్ళు తిరిగిపడిపోయారట. ఆ పరిస్థితుల్లో వేరే ఎవరు ఉన్నా అంత తొందరగా కోలుకోలేరు. కానీ మిథున్ చక్రవర్తి కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వచ్చి షూట్ లో పాల్గొన్నారట. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారని చెప్పాడు దర్శకుడు. మొన్నీ మధ్యే ఆషిఖీ హీరో రాహుల్ రాయ్ కి ఇదే సినిమా షూటింగ్ లో అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే.
Must Read ;- హైదరాబాద్ లో వాలిన సూపర్ స్టార్ రజినీ కాంత్