రవితేజ కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ‘రాజా ది గ్రేట్‘ తరువాత ఆ స్థాయి హిట్ ను ఆయన ఇంతవరకూ చూడలేదు. దాంతో కొత్త ఏడాదిలో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేశాడు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ గా రవితేజ తనదైన స్పీడ్ చూపించనున్నాడు. ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ నటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా పనులు జరుగుతున్నాయి.

రవితేజ తాజా చిత్రంగా రానున్న ‘క్రాక్’ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాను కూడా ఆయన ప్రకటించాడు .. ఆ సినిమా పేరే ‘ఖిలాడి. దీనిని బట్టి చూస్తుంటే K అక్షరంతో కూడిన టైటిల్స్ రవితేజకి సెంటిమెంట్ గా మారినట్టు అనిపిస్తోంది. గతంలో ఆయన చేసిన కృష్ణవంశీ ఖడ్గం, వి.వి.వినాయక్ ‘కృష్ణ’ సినిమాలు భారీ విజయాల్ని అందుకున్నాయి. ఆ తరువాత వచ్చిన ‘కిక్’ సినిమా రవితేజ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ‘ఖతర్నాక్ , కిక్ 2’ లాంటి సినిమాలు పరాజయం పాలైనప్పటికీ.. ఇప్పుడు ఆ సెంటిమెంట్ పైనే రవితేజ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది.
‘ఖిలాడి‘ సినిమాకి రమేశ్ వర్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ‘ఒక ఊరిలో’ సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రమేశ్ వర్మ, ఆల్రెడీ రవితేజతో ఇంతకుముందే ‘వీర’ అనే ఒక సినిమా చేశాడు. కాకపోతే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఈ మధ్య ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ కొట్టిన రమేశ్ వర్మ, తన తదుపరి సినిమాగా రవితేజతో ‘ఖిలాడి’ని పట్టాలెక్కించాడు. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి కథానాయికలుగా అలరించనున్న ఈ సినిమాలో అనసూయ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని అంటున్నారు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.
Must Read ;- బల్లేగా తగిలావే బంగారం అంటున్న క్రాక్











