యోగాలోని ‘శీర్షాసనం’ గురించి వినే ఉంటారు.. మరి చీర్స్ ఆసనం గురించి ఎప్పుడైనా విన్నారా? లేదా.. అయితే ఇప్పుడు తెలుసుకుందురు రండి.. యోగాలో ఇప్పుడు ఓ సరికొత్త ఆసన ప్రక్రియను కనుగొన్నారు.. కాంబోడియా కాసులు. ‘బీర్ యోగా’ పేరుతో ఈ ఆసక్తికర ఆసనాలను రూపొందింది. రాజధాని ఫ్నోమ్‌పెన్ నగరంలో ఓ బీర్ బ్రేవరీ.. కరోనా లాక్ డౌన్‌తో దెబ్బతిన్న తన వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ఈ తాజా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
Must Read ;- ‘ప్రేగు ఇన్‌ఫెక్షన్’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!
బీర్ గ్లాస్‌తో చీర్స్ యోగా..
బీర్ గ్లాస్ ఓ చేత్తో పట్టుకుని రకరకాల భంగిమల్లో ఈ ఆసనం వేయాల్సి ఉంటుంది. ఓ భంగిమ పూర్తయ్యాక గట్టిగా చీర్స్ చెప్తూ గ్లాసులోని బీర్‌ను ఓ సిప్ చేయాలి. ఆ తర్వాత మరో భంగిమ మరో సిప్. ఇలా.. ఒక్కో భంగిమకి ఒక్కో సిప్ చేస్తూ.. సిప్పు సిప్పుకీ మధ్య చీర్స్ చెబుతూ.. బీరు మొత్తం లాగించేయాలి. ఒక్క చుక్క బీరు కూడా కింద పడకుండా యోగాసనాలు వేస్తూ మొత్తంగా సిప్ చేసినవాళ్లు ఈ చీర్స్ ఆసన ప్రక్రియను బాగా వేసినట్లు లెక్క. ఇలా ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆనందానికి ఆనందం అనుకుంటూ.. గ్లాసుల కొద్దీ బీర్ లాగించేస్తున్నారు కాంబోడియా వాసులు. ఈ యోగా.. ప్రస్తుతం విదేశీ పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read ;- పొట్ట తగ్గాలా? అయితే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!
నయా యోగశాల
దీంతో.. జనం ఈ నయా యోగశాలకు క్యూ కడుతున్నారు. బ్రేవరీ నిర్వాహకులకు కాసుల పంట పండిస్తున్నారు. దీనిపై ఈ బ్రేవరీ నిర్వాహకుడు మాట్లాడుతూ.. ‘ఇది సంప్రదాయ యోగా కాదు. మా బ్రేవరీ ప్రచారం కోసం సరదాగా రూపొందించిన యోగా. కస్టమర్లందరూ ఇందులో చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు. గతంలోనూ అమెరికాలో ఇలాంటివి చూశాం. డాగ్ యోగా, గోట్ యోగా, ఏరియల్ యోగా లాంటి వాటి స్ఫూర్తితోనే ఈ బీర్ యోగాని రూపొందించాం అని పేర్కొన్నారు. ఈ ఆసనానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Must Read ;- గర్భధారణ సమయంలోనూ యోగాసనాలు.. ఎవరా బ్యూటీ?
Also Read ;- వీటిని తింటే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..











