దేవుడా.. ఏంటిది? కరోనాతో 2020 మొత్తం గడిచిపోయింది.. 2021లోకి అడుగుపెడ్తున్న సమయంలో కొత్తరకం కరోనా అంటూ షాకిచ్చింది లండన్. దాని గురించి కనీసం ఇంకా సరైన వివరాలు కనిపెట్టలేదు శాస్త్రవేత్తలు. ఈ లోగానే మరో కొత్త కరోనాను గుర్తించినట్టు లండన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హెన్‌కాక్ అధికారంగా వెల్లడించడంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. కొత్తగా వచ్చిన దాని వివరాలే ఇంకా పూర్తిగా తెలుసిరాలేదు. వెంటనే మరొకటా అంటూ తలల పట్టుకుంటున్నారు ప్రపంచ దేశాధినేతలు. మరి ఈ సరికొత్త కరోనాను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
Also Read ;- అసలు ‘కొత్త రకం’ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? అత్యంత ప్రమాదకరమా?
దక్షిణాఫ్రికా ప్రయాణాలు రద్దు చేసుకోండి..
దక్షిణాఫ్రికా నుండి వచ్చిన లండన్ వాసుల్లో ఇద్దరికి సరికొత్త కరోనా లక్షణాలు గుర్తించినట్లు లండన్ అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా ప్రయాణాలను రద్దు చేసుకోండని.. అలాగే అక్కడి నుండి వచ్చే వారిని ప్రత్యేకంగా పరిక్షలు నిర్వహించమని ప్రపంచ దేశాలకు సూచించింది లండన్. తమ దేశం కూడా ఈ దిశగా చర్యలు ఇప్పటికే ప్రారంభించిందని చెప్పుకొచ్చింది. లండన్‌లో లాక్ డౌన్ ఉన్న ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విధించనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నట్లు కూడా తెలిపింది. కరోనా, కొత్త కరోనా, ఇప్పుడేమో మరోరకం కరోనా.. వీటి వివరాలు పూర్తిగా తెలుసివచ్చేంత వరకూ లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని అధికారులు తెలియపరుస్తున్నారు.
ఇప్పటికే కరోనా నుండి బయటపడలేదు ప్రపంచదేశాలు.. పుండు మీద కారంలాగా.. కొత్త కరోనా దిగబడింది. కరోనా కంటే అత్యంత వేగంగా విస్తరించే గుణం కలిగి ఉండడంతో ప్రపంచ దేశ ప్రజలు వణికి చస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కొత్త కరోనా కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాక పోవడం కాస్త ఆశావహ దృక్పధం కనిపిస్తుంది. ఉన్న ఈ రెండు కరోనాలతో వేగలేక చస్తుంటే మరి ఈ మరోరకం కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుండని బ్రిటన్ ప్రకటించింది. ఇక ప్రపంచదేశాలు ఆపరేషన్ దక్షిణాఫ్రికా, లండన్ మొదలుపెడితే కానీ, వీటిని ఆపడం కష్టం.
Must Read ;- భారత్‌లోనూ మొదలైన కొత్త కరోనా ప్రకంపనలు