ప్రస్తుతం ప్రపంచమంతా కొత్త రకం కరోనా గురించి మల్లగుల్లాలు పడడం మొదలెట్టారు. గత కొద్దికాలంగానే టెస్ట్‌లు, క్వారంటైన్‌లు, ఐసోలేషన్ అనే పదాలు కాస్త తక్కువవుతూ వస్తున్న నేపథ్యంలో కరోనాలోని కొన్ని మార్పులు వల్ల అతి అత్యంత వేగంగా వ్యాపిస్తుందని, అలాగే ప్రమాదకరంగా మారుతుందని, ఇప్పటికే లండన్‌లో తాజాగా నమోదవుతున్న కేసులు 70 శాతం పైన అవే ఉండడంతో ప్రపంచదేశాలు దాదాపు లండన్ విమానాలను రద్దు చేయడంతోపాటు.. ఆ దేశం నుండి వచ్చిన వక్తులను వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. ఈ కొత్త రకం గురించి సరికొత్త విశ్లేషణలను, పరిశోధనా వివరాలను బయటపెడ్తున్నారు. అవి షాకింగ్ కలిగించడంతోపాటు కాస్త భయపెడుతున్నాయనడంలో సందేహం లేదు.
పిల్లలు జాగ్రత్త
కొవిడ్-19 వచ్చిన వారు ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందిపడేవారు. కరోనా తగ్గిన తర్వాత కూడా చాలా మంది ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బందిపడి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా వయసుపైబడిన వారు ఎక్కువగా ఇబ్బందిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ కురువృద్ధులు మోతీలాల్ వోరా కూడా ఇదే సమస్యతో మరణించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటి కరోనా విషయానికొస్తే, పిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
Must Read ;- కల్లోలం రేపుతున్న కొత్తరకం కరోనా
ఈ కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే ముందుగా రోగనిరోధక శక్తిపై దాడి చేస్తుందని వైరాలజీ స్పెషలిస్ట్, వైరస్ అడ్వయిజరీ గ్రూప్ సభ్యులు వ్యాండీ బర్క్లే వెల్లడించారు. ఈ కొత్త స్టెయిన్ వల్ల పిల్లలకు ప్రమాదమని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ నెయిల్ ఫర్గ్యూసన్ కూడా వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కేవలం ప్రాధమిక నిర్థారణ ద్వారా వెల్లడిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని పూర్తి ఆధారాలతో నిరూపించడానికి ఇంకొన్ని వారాల పరిశోధన అవసరమని చెప్తున్నారు.
జాగ్రత్తలు పాటించండి
ఈ కొత్తరకం కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ కరోనా స్టెయిన్ గురించి పూర్తి వివరాలు తెలియరాలేదని, కాబట్టి ప్రస్తుత సమాచారం ప్రకారం అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఈ కరోనా మ్యుటేషన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి, అత్యంత ప్రమాదకరమని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో ప్రకటించింది. స్పష్టత వచ్చే వరకు దేశాలంతా అత్యంత అప్రమత్తత పాటించాలని, కరోనా తిరిగి ప్రపంచంలో పుంజుకోకుండా జాగ్రత్తలు పాటించాలని తెలియజేసింది.
Also Read ‘- జలుబు మంచిదే.. కోల్డ్‌తో కొవిడ్ నుంచి రక్షణ..!