ఇక నుంచి పూర్తిస్థాయి సీటింగ్ సామర్థ్యంతో సినిమా థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఫిబ్రవరి 1నుంచి 100 శాతం ఆక్కుపెన్సీకి కేంద్ర సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా వినోద రంగం కుదేలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 50 శాతం ఆక్కుపెన్సీతో సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. ఇది ఏమాత్రం ఊరటను ఇవ్వడం లేదు. ప్రభుత్వం కూడా క్రమేపీ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది.
అన్ లాక్ కొత్త నిబంధనల ప్రకారం సినిమా హాళ్లకు ఫుల్ పర్మిషన్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఆమేరకు ఉత్తర్తులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతులు వచ్చేశాయి. చిత్ర పరిశ్రమకు ఇది శుభపరిణామమని చెప్పాలి.
ఫిబ్రవరి 1 నుంచే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ఇప్పటిదాకా ఉన్న 50 శాతం ఆక్కుపెన్సీకి ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చి వెసులు బాటు కల్పించడంతో నిర్మాతలు కూడా సినిమా విడుదలకు ముందుకు వచ్చారు. ఇప్పటికే చాలా సినిమాలు నిర్మాణం పూర్తయి విడుదలకు ఎదురుచూస్తున్నాయి. ఫుల్ ఆక్యుపెన్సీ కూడా రావడంతో చాలా సినిమాలు విడుదలకు క్యూకడుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో దాదాపు చాలా సినిమాలు విడుదల కానున్నాయి.
Must Read ;- ఈ ఏడాది సినిమాల తాకిడి.. ఓటీటీ గతేంటి?