లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన కీలక బిల్లు అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇకపై ఢిల్లీలో అత్యున్నత నిర్ణాయక అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ సొంతం అవుతుంది. అంటే, ఇకపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం ఉంటేనే కార్యరూపం దాల్చుతుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. నిన్నటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. ఈ బిల్లుకు గతేడాది మార్చిలో పార్లమెంటు ఆమోదం లభించగా, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక ఢిల్లీకి ప్రభుత్వం నిర్ణయం ఏదైనా లెఫ్టి నెంట్ గవర్నర్ తీసుకుంటాడు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ప్రభుత్వ అధికారాలను కత్తిరించడం, ప్రజలను అవమానించేనట్టేనని అన్నారు.
Must Read ;- కేజ్రీ మరో కీలక నిర్ణయం : ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు