ఆర్థిక పరిస్థితి దిగజారడానికి ఉద్యోగుల కారణమా?
ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అధికార కమిటీ సిఫార్సు చేసిన మొత్తానికి మించి ప్రభుత్వం భరించలేని స్థితిలో లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల ఎదుట కుండబద్దలు కొట్టారు. మంగళవారం అమరావతిలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలతో సజ్జల భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా.. పలు అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించారు. కార్యదర్శుల కమిటీ ఇచ్చిన ఫిట్మెంట్ ను 14.29 శాతం సిఫార్సు అమలు చేస్తామని ఉద్యోగు సంఘాలకు చెప్పారు. పీఆర్సీ కమిటీ 27 శాతం ప్రతిపాదించగా సీఎస్ కమిటీ కేవలం 14.29 శాతమే సూచిచండం సరికాదని సజ్జల ముందే ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర అర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు డిమాండ్ చేసినంత ఫిట్మెంట్ ను ఇవ్వలేమని సజ్జల తేల్చి చెప్పాడు. అలానే తెలంగాణ ఐఆర్ ఇవ్వడం లేదని, అక్కడ సిఫార్సులను అమలు చేయకుండా వాయిదా వేస్తున్నారని కొన్ని కాకిలెక్కలు జోడించి విరించారు. ఏపీలో జగన్ రెడ్డి ఎన్నికల హామీ ఇచ్చేటప్పుడు ఆ సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ అప్పటికే అధికారంలో ఉంది. ఇక్కడ ఉద్యోగుల పరిస్థితులు తెలియని కావు. అటువంటప్పుడు ఏపీ ఉద్యోగులకు జగన్ రెడ్డి ఎలా హామి ఇచ్చారని? ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. ఇలా 2018 జూలై 1 నుంచి ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం మీనమేషాలెక్కిస్తున్నారు.
హామీ ఇచ్చేటప్పుడు స్టేట్ బడ్జెట్ గుర్తు లేదా?
ఉద్యోగులకు భూటకపు హామీలిచ్చి గద్దెనెక్కిన జగన్ రెడ్డి .. నేడు వారి డిమాండ్స్ ను నెరవేర్చమంటే చేతులెత్తేశాడు. అలానే సీపీఎస్ రద్దు చేస్తానన్నా జగన్.. నేడు అది అమలు చేయమంటే స్టేట్ బడ్జెట్ సరిపోదని ఉద్యోగుల ముందు వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. ఉద్యోగ సంఘాల 71 డిమాండ్స్ ను అధికారులే తేల్చుతారన్న సజ్జల మాట్లాల్లో ఆంతర్యమేంటో అర్థంకానిది కాదు. ఇవన్నీ ఇలా ఉంటే రేపు సీఎం జగన్ రెడ్డితో ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నారు. ఈ సమావేశం తరువాత ఉద్యోగ సంఘాల ఉద్యమం ఉధృతి ఆధారపడింది. మరోపక్క నివేదిక తయారు చేసిన కమిటీ తమతో చర్చికుండా 14.29 శాతం ఫిట్మెంట్ ను ఎలా నిర్ధారిస్తారని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు ప్రశ్నించారు. ఫిట్మెంట్, మానిటరీ బెన్ఫిట్ అమలు, లబ్ధిపై తేడాలు ఉన్నాయని, తప్పనిసరిగా 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిదేనని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- పీఆర్సీ నివేదిక కాదది..కేవలం రిపోర్ట్ మాత్రమే! మరో మోసం గురు..!!










